అక్షరటుడే, బోధన్ : MLA Sudarshan Reddy | ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు (Medical Services) అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బోధన్ పట్టణంలోని గ్రామ చావడి వద్ద నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖాలను ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi)తో కలిసి ప్రారంభించారు.
MLA Sudarshan Reddy | మెరుగైన వైద్యం అందించడం కోసం..
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం వైద్యరంగానికి రూ. కోట్లలో ఖర్చు చేస్తుందన్నారు. ప్రజలకు సరైన వైద్యం అందినప్పుడే వారి స్థితిగతులు మారుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రాజశ్రీ, బోధన సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub Collector Vikas Mahato), ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్బిన్ హందాన్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.