MLa Pocharam | డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే పోచారం

అక్షరటుడే, బాన్సువాడ: MLa Pocharam | డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వం వ్యవసాయం సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. పట్టణ శివారులో ఆదివారం రూ.20లక్షల వ్యయంతో వారాల సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం పాత బాన్సువాడ చావడి వద్ద రూ.15లక్షలతో నిర్మించిన నూతన చావిడి భవనాన్ని ప్రారంభించారు. MLa Pocharam | మహిళలకు పెద్దపీట.. పాత బాన్సువాడలోని (Banswada) హనుమాన్ […]

అక్షరటుడే, బాన్సువాడ: MLa Pocharam | డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వం వ్యవసాయం సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. పట్టణ శివారులో ఆదివారం రూ.20లక్షల వ్యయంతో వారాల సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం పాత బాన్సువాడ చావడి వద్ద రూ.15లక్షలతో నిర్మించిన నూతన చావిడి భవనాన్ని ప్రారంభించారు.

MLa Pocharam | మహిళలకు పెద్దపీట..

పాత బాన్సువాడలోని (Banswada) హనుమాన్ ఫంక్షన్ హాల్‌లో డ్వాక్రా మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు పెద్దపీట వేస్తూ వారికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ క్రమంలోనే వారికి పలు రకాల ప్రయోజనాలు కల్పిస్తోందన్నారు.

ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్ల (Indira Amma canteens) నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా సంఘాలు విజయవంతంగా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని సూచించారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ బాలరాజు, కృష్ణారెడ్డి, నార్ల సురేష్, ఎజాజ్, గంగాధర్, లింగం, ఖాలెక్, గోపాల్ రెడ్డి, మహమ్మద్ గౌస్, విఠల్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...