Homeజిల్లాలుకామారెడ్డిMla Madan Mohan | ఎల్లారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే మదన్​...

Mla Madan Mohan | ఎల్లారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే మదన్​ మోహన్​

ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మదన్​ మోహన్​ అన్నారు. ఎల్లారెడ్డి పెద్దచెరువుపై జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

- Advertisement -

అక్షరటుడే ఎల్లారెడ్డి: Mla Madan Mohan | ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మదన్​ మోహన్​ అన్నారు. ఎల్లారెడ్డి (Yellareddy) పెద్ద చెరువుపై జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ చేశారు.

పెద్ద చెరువుపై (Pedda Cheruvu) జరుగుతున్న మినీ ట్యాంక్ బండ్ పనులను పరిశీలించారు. ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు మినీ ట్యాంక్ బండ్ (Mini tank bund) పనులను సకాలంలో పూర్తి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాకింగ్ ట్రాక్ (Walking track), లైటింగ్, పార్క్, గార్డెన్, ఓపెన్ జిమ్, క్యాంటిన్, బోటింగ్ తదితర వసతులు కల్పించేందుకు రూ.3 కోట్ల ప్లాంటేషన్ పనుల కోసం నిధులు మంజూరయ్యాయన్నారు.

పట్టణ ప్రజలకు ఈ వసతులు అందుబాటులోకి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యాటకంతో ట్యాంక్​బండ్​కు కొత్తశోభ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఎల్లారెడ్డి బస్టాండ్​ను పరిశీలించారు. బస్టాండ్​లో ఏర్పాటుచేసిన క్యాంటీన్​లో కార్యకర్తలతో కలిసి టిఫిన్ చేశారు.

ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని హంగులతో బస్టాండ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నుంచి ఇతర ప్రాంతాలకు ట్రాన్స్​ఫర్​ చేసేందుకు ఏర్పాటుచేసిన పార్సిల్ సర్వీస్​ను సైతం ఆయన పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని వాళ్లకు సూచించారు. ఆయనతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Must Read
Related News