అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bharat Coking Coal IPO | 2026 సంవత్సరంలో మెయిన్‌బోర్డు నుంచి తొలి కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన బీసీసీఎల్ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ఈనెల 9న ప్రారంభం కానుంది. జీఎంపీ బాగుండడంతో ఈ ఐపీవోపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
దేశంలోనే అతిపెద్ద కోకింగ్ బొగ్గు ఉత్పత్తిదారు అయిన బీసీసీఎల్ (BCCL)ను 1972లో స్థాపించారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ (West Bengal)లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారీ ఎర్త్ మూవింగ్ మెషినరీతో ఉత్పత్తిని పెంచుకుంటూ, మంచి వృద్ధిని సాధిస్తోంది. 2024 ఏప్రిల్ 1 నాటికి సుమారు 7,910 మిలియన్ టన్నుల అంచనా నిల్వలతో దేశంలోని అతిపెద్ద కోకింగ్ బొగ్గు (Coking Coal) నిల్వదారులలో ఒకటిగా నిలిచింది. 2014లోనే మినీ రత్న హోదాను పొందింది. ఈ కంపెనీ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 1,071 కోట్లు సమీకరించనుంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్. ప్రమోటర్ కోల్ ఇండియా 46.57 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది.
ఆర్థిక వివరాలు..
2023 -24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 14,652.53 కోట్ల ఆదాయం ద్వారా రూ. 1,564.46 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 14,401.63 కోట్లకు, నికర లాభం రూ. 1,240 కోట్లకు తగ్గాయి. ఇదే సమయంలో ఆస్తులు మాత్రం రూ. 14,727.73 కోట్లనుంచి రూ. 17,2833.48 కోట్లకు పెరగాయి.
ధరల శ్రేణి..
కంపెనీ రూ. 10 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 21 నుంచి రూ. 23 మధ్య నిర్ణయించింది. ఒక లాట్‌లో 600 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 13,800తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 14 లాట్ల కోసం దరఖాస్తు చేయవచ్చు.
కోటా, జీఎంపీ..
క్యూఐబీ(QIB)లకు 50 శాతం, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఉద్యోగుల రిజర్వేషన్ విభాగం కింద పాల్గొనే అర్హత గల ఉద్యోగులకు కంపెనీ ఒక్కో షేరుపై రూ. 1 డిస్కౌంట్ అందిస్తోంది. కోల్ ఇండియా వాటాదారులు వాటాదారుల కోటాలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ కంపెనీ ఐపీవో వాల్యూయేషన్స్ ఇండస్ట్రీ కన్నా తక్కువగా ఉండడంతో గ్రే మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఒక్కో ఈక్విటీ షేరు రూ. 15 ప్రీమియం(Premium)తో ట్రేడ్ అవుతోంది. అంటే లిస్టింగ్ సమయంలో 65 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు..
సబ్‌స్క్రిప్షన్ ప్రారంభ తేదీ : జనవరి 9.
ముగింపు తేదీ : జనవరి 13.
అలాట్‌మెంట్ : జనవరి 14.
లిస్టింగ్ : జనవరి 16 న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో షేర్లు లిస్ట్ అవుతాయి.