93
అక్షరటుడే, బాన్సువాడ : Banswada Municipality | బాన్సువాడ మున్సిపాలిటీకి సంబంధించిన ఓటర్ల తుది జాబితాను మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు (Municipal Commissioner Srihari Raju) సోమవారం విడుదల చేశారు.
Banswada Municipality | 19 వార్డుల్లో..
మొత్తం 19 వార్డుల్లో 24,188 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 11,578, మహిళా ఓటర్లు 12,599 మంది ఉన్నారు. వార్డుల వారీగా ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే, 6వ వార్డులో అత్యధికంగా 1,812 మంది ఓటర్లు ఉండగా, 19వ వార్డులో అత్యల్పంగా 1,064 మంది ఓటర్లు ఉన్నారు.