అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sankranthi Movies | సంక్రాంతి పండుగకు సినిమాలు సందడి చేయనున్నాయి. ఇప్పటికే ప్రభాస్ నటనతో ‘రాజాసాబ్’ (Raja saab) చిత్రం థియేటర్లలో రిలీజ్ కాగా.. మరిన్ని చిత్రాలు విడుదల కానున్నాయి. అలాగే ఓటీటీ వేదికల్లో కూడా ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి.
Sankranthi Movies | మన శంకరవరప్రసాద్‌గారు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ కామెడీ చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేశ్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sankranthi Movies | భర్త మహాశయులకు విజ్ఞప్తి
మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
Sankranthi Movies | అనగనగా ఒక రాజు
నవీన్ పొలిశెట్టి గౌరవపురం జమీందారు మనవడు రాజు పాత్రలో నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ మూవీ సంక్రాంతి బహుమతిగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నారీ నారీ నడుమ మురారి
శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్యలు ప్రధాన పాత్రల్లో నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం కూడా సంక్రాంతి స్పెషల్‌గా రిలీజ్ కానుంది. జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది.
Sankranthi Movies | ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫాంలలో విడుదల కానున్న చిత్రాలు, సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
- తస్కరీ (హిందీ సిరీస్) – జనవరి 14
- అగాథా క్రిస్టీ సెనెన్ డయల్స్ (వెబ్ సిరీస్) – జనవరి 14
- ది రిప్ (సినిమా) – జనవరి 16
అమెజాన్ ప్రైమ్
- నైట్ మేనేజర్ 2 (వెబ్ సిరీస్) – జనవరి 11
- బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి (కన్నడ సినిమా) – జనవరి 12
- 120 బహదూర్ (హిందీ సినిమా) – జనవరి 16
Sankranthi Movies | సోనీలివ్
- కాలమ్‌కావల్ (మలయాళం సినిమా) – జనవరి 16
డిస్నీ+ హాట్‌స్టార్
- ఇండస్ట్రీ సీజన్ 4 (వెబ్ సిరీస్) – జనవరి 11
జీ5
- భా.. భా.. బా (మలయాళం సినిమా) – జనవరి 16
- గుర్రం పాపిరెడ్డి (తెలుగు సినిమా) – జనవరి 16