Homeక్రైంFilm industry | సినీ పరిశ్రమకు రూ.22 వేల కోట్ల నష్టం.. పైరసీ ముఠాను పట్టుకున్న...

Film industry | సినీ పరిశ్రమకు రూ.22 వేల కోట్ల నష్టం.. పైరసీ ముఠాను పట్టుకున్న పోలీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Film industry | ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమా (Cinema)లను కొందరు పైరసీ చేసి ఆన్​లైన్​లో పెడుతున్న విషయం తెలిసిందే. దీంతో నిర్మాతల (Producers)కు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం చేకూరుస్తున్న పైరసీకి వ్యతిరేకంగా అన్ని భాషల ఇండస్ట్రీలు పోరాడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ (Hyderabad)​ పోలీసులు దేశంలోనే పెద్ద పైరసీ ముఠాను అరెస్ట్​ చేశారు.

పైరసీ ముఠాకు చెందిన ఆరుగురు నిందితులను తెలంగాణ సైబర్​ క్రైమ్​ పోలీసులు (Cyber Crime Police) అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా తెలుగుతో సహా ఇతర భాషల చిత్రాలను సైతం పైరసీ చేస్తున్నట్లు గుర్తించారు. వీరు ఇండస్ట్రీకి దాదాపు రూ.22 వేల కోట్ల నష్టం చేసినట్లు పోలీసులు అంచనా వేశారు.

Film industry | ఇలా దొరికారు..

శ్రీ విష్ణు హీరోగా తెలుగులో సింగిల్​ మూవీ (Single Movie)ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ (Geetha Arts)​ బ్యానర్​పై నిర్మించారు. ఈ చిత్రం మే 1న విడుదలైంది. అయితే ఈ సినిమాను కొందరు పైరసీ చేశారు. దీంతో చిత్ర బృందం గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు జులై 3న వనస్థలిపురానికి చెందిన కిరణ్‌ను పైరసీ కేసులో అరెస్ట్​ చేశారు. అతడిని విచారించి ముఠా సభ్యులు దుబాయి, మయన్మార్‌, నెదర్లాండ్‌ కేంద్రంగా దందా చేస్తున్నట్లు గుర్తించారు. తాజాగా అందులో ఆరుగురిని అరెస్ట్​ చేశారు.

Film industry | పైరసీతో తీవ్ర నష్టం

చిత్ర పరిశ్రమకు పైరసీతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వేల మంది కష్టపడి, వందల కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన సినిమాను కొందరు పైరసీ చేస్తున్నారు. దీంతో ప్రజలు థియేటర్లకు రాకుండా పైరసీ కాపీలను చూస్తున్నారు. కొన్ని వెబ్​సైట్​లలో అయితే చిత్రం రిలీజ్​ కాగానే పైరసీ కాపీ అప్​లోడ్​ చేస్తున్నారు. ఫలితంగా ఆయా సినిమాలకు భారీగా నష్టం వస్తోంది. కాగా అడ్డగోలుగా సినిమా ధరల పెంపు (Ticket Rates), థియేటర్లలో దోపిడీ సైతం ప్రజలను పైరసీ చూసేలా చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.

Must Read
Related News