Raithu Mela | ముగిసిన రైతు మహోత్సవం

అక్షరటుడే, ఇందూరు:Raithu Mela | జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Giriraj Government Degree College) మైదానంలో మూడు రోజులపాటు నిర్వహించిన రైతు మహోత్సవం బుధవారం ముగిసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్టాళ్లను సందర్శించారు. అధిక దిగుబడులను అందించే వంగడాలు, మేలు జాతి పాడి పశువులు, సాగు పరికరాలు, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులను […]

అక్షరటుడే, ఇందూరు:Raithu Mela | జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Giriraj Government Degree College) మైదానంలో మూడు రోజులపాటు నిర్వహించిన రైతు మహోత్సవం బుధవారం ముగిసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహించారు.

నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్టాళ్లను సందర్శించారు. అధిక దిగుబడులను అందించే వంగడాలు, మేలు జాతి పాడి పశువులు, సాగు పరికరాలు, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులను తిలకించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు వివిధ రకాల పంటల సాగులో పాటించాల్సిన మెలకువలు, సస్యరక్షణ చర్యలు, ఆధునిక వ్యవసాయం, భూసారం పెంపుదల, అధిక దిగుబడులను అందించే వంగడాలు, తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

Raithu Mela | స్టాళ్ల సందర్శన

చివరి రోజు బుధవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu)తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతి రెడ్డి రాజిరెడ్డి తదితరులు రైతు మహోత్సవ వేదిక స్టాళ్లను సందర్శించారు.

Raithu Mela | రైతు మేళాతో ఎంతో ప్రయోజనం..

ఈ సందర్భంగా కలెక్టర్(Nizamabad Collector) మాట్లాడుతూ.. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన జిల్లాతో పాటు మిగిలిన నాలుగు జిల్లాల రైతులకు(Farmers) ఎంతో ప్రయోజనం చేకూర్చిందన్నారు. ప్రస్తుత పరిస్థితులు సామాజిక అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో శాస్త్రవేత్తలు కనుగొన్న నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం తదితరంశాలపై నిపుణులు, శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజీద్ హుస్సేన్​, ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకుడు శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.

 

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...