అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sangareddy | తనకు గుండెపోటు వచ్చినా.. బస్సు డ్రైవర్ (bus driver) ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. అనంతరం ఆయన చికిత్స పొందుతూ చనిపోయాడు.
సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం పల్వట్ల దగ్గర ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండె పోటు (heart attack) వచ్చింది. బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో డ్రైవర్ జనార్దన్ తన నొప్పిని భరిస్తునే బస్సును పక్కన ఆపాడు. ఆయన చాకచాక్యం వ్యవహరించడంతో 40 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.
అనంతరం డ్రైవర్ జనార్దన్‌ను ఆస్పత్రికి తలించారు. హైదరాబాద్ తార్నాక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనార్దన్ మృతి చెందాడు. తనకు గుండెపోటు వచ్చినా కూడా బస్సులోని ప్రయాణికుల గురించి ఆలోచించిన డ్రైవర్‌ను అందరు కొనియాడుతున్నారు. డ్రైవర్ తన ప్రాణాలు పోతున్నా.. తమను కాపాడడని ప్రయాణికులు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మృతిపై ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగులు సంతాపం తెలిపారు.