4
అక్షరటుడే, ఇందూరు: Journalist Muneer | సీనియర్ జర్నలిస్ట్, సింగరేణి (Singareni) కార్మికుడు, విప్లవ కార్యకర్త ఎండీ మునీర్ మృతి సింగరేణి కార్మికవర్గానికి తీరనిలోటు అని ఇంటర్నేషనల్ దళిత జర్నలిస్ట్ నెట్‌వర్క్ (International Dalit Journalist Network) చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, రాష్ట్ర కన్వీనర్ మంద జనార్దన్, కో కన్వీనర్ ఎడ్ల సంజీవ్ అన్నారు. ఈ మేరకు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని (Hyderabad) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మునీర్ మృతి చెందాడని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాక్షించారు. కార్మిక వర్గానికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.