అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Municipal Elections | రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికల నగరా మోగనుంది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యుల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ (Congress Party) పురపోరుపై ఫోకస్ చేసింది.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. మున్సిపాలిటీల్లో సైతం సత్తా చాటాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల కోసం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇన్ఛార్జీలను నియమించారు. మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.
Municipal Elections | ఇన్ఛార్జీలు వీరే..
నిజామాబాద్ – ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆదిలాబాద్ – సుదర్శన్ రెడ్డి, మల్కాజ్‌గిరి – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మెదక్ – వివేక్, చేవెళ్ల – శ్రీధర్‌బాబు, కరీంనగర్ – తుమ్మల నాగేశ్వరరావు, నల్గొండ – అడ్లూరి లక్ష్మణ్, పెద్దపల్లి – జూపల్లి కృష్ణారావు, భువనగిరి – సీతక్క, వరంగల్ – పొంగులేటి, మహబూబ్‌నగర్ – పొన్నం ప్రభాకర్, జహీరాబాద్ – అజహరుద్దీన్, మహబూబ్‌నగర్ – దామోదర రాజనర్సింహ, నాగర్‌కర్నూల్ – వాకిటి శ్రీహరి, ఖమ్మం బాధ్యతలను మంత్రి కొండా సురేఖ అప్పగించారు.
Municipal Elections | సన్నాహాక సమావేశాలు
ఇన్ఛార్జీలుగా నియమితులైన వారు ఆయా పార్లమెంట్ పరిధిలో అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. మంగళవారం నుంచి పార్లమెంట్ సెగ్మెంట్లలో మున్సిపాలిటీల వారీగా సన్నాహక సమావేశాలు పెట్టాలని ఆదేశించారు. బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో చేరికలను ప్రోత్సహించాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేడు దావోస్‌కు వెళ్లనున్నారు. ఆయన ఫిబ్రవరి 1న హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. ఆ లోగా పుర పోరుకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల చేయడానికి సిద్ధం అవుతోంది. దీంతో మెజారిటీ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకునేలా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది.