అక్షరటుడే, బోధన్ : Bodhan | జంగమ సమాజ గురువులపై వ్యాఖ్యలను ఖండిస్తున్నామని జంగమ లింగాయత్ సమాజ్ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు బోధన్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల జుక్కల్ నియోజకవర్గంలో (Jukkal Constituency) మాజీ ఎమ్మెల్యే జంగమ సమాజ్ గురువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. స్వామీజీలు కులమతాలకు అతీతంగా భక్తులందరికీ ఒకే విధంగా ధర్మబోధ చేస్తారన్నారు. సమాజమంతటికీ మార్గదర్శుకులుగా నిలిచే గురువులపై మాజీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.
Bodhan | సీఎం కేసీఆర్ సైతం..
సీఎం కేసీఆర్ (KCR) సైతం వీరశైవ గురువులను తెలంగాణ భవన్ (Telangana Bhavan)కు ఆహ్వానించి పూజించారన్నారు. గతంలో స్వామీజీల వద్ద సలహాలు తీసుకున్న వ్యక్తే నేడు ఓటమి తర్వాత వారిని విమర్శించడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా (Nizamabad District) ఎంబీసీ అధ్యక్షుడు పురాణే అజయ్ కుమార్, జిల్లా జంగమ సమాజ్ అధ్యక్షుడు గణాచారి శివకుమార్, బోధన్ పట్టణ ప్రతినిధులు నర్సింగ్ అప్పా, లక్ష్మణరావు పటేల్, పౌడయ్య, రాజేందర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.