అక్షరటుడే, ఇందూరు : Collector Nizamabad | జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్లోని (Gangasthan) నిజామాబాద్ నార్త్ మండల కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని (Kasturba Gandhi Girls School) కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) గురువారం సందర్శించారు. డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, తరగతి గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని బాలికలను అడిగి తెలుసుకున్నారు.
Collector Nizamabad | విద్యార్థులతో కలిసి చెస్ ఆడి..
తరగతి గదులను సందర్శించి ఆయా సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి, విద్యార్థినుల సామర్థ్యాన్ని అంచనా వేశారు. కలెక్టర్ స్వయంగా ఉపాధ్యాయురాలిగా మారి, తెలుగు, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులలో పలు అంశాలను బోర్డుపై రాసి బాలికలకు బోధించారు. వెంట తెచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లను విద్యార్థినులకు అందించారు. భోజన విరామ సమయంలో పలువురు బాలికలు చెస్ ఆడుతుండడాన్ని గమనించిన కలెక్టర్ కూడా వారితో కలిసి నేలపై కూర్చుండి చెస్ ఆడారు. విద్యార్థినులు తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి పి.అశోక్ తదితరులున్నారు.