అక్షరటుడే, ఇందూరు : Municipal Elections | మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో నిజామాబాద్ (Nizamabad) నగర పాలక సంస్థకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేశారు. కళాశాలలో అనువుగా ఉన్న ఆయా విభాగాల గదులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Municipal Elections | రవాణా.. పార్కింగ్ సౌకర్యం..
రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాలను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ (Commissioner Dileep Kumar), ఇతర అధికారులతో కౌంటింగ్, డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సాఫీగా జరిగేలా, అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.