HomeUncategorizedCM Siddaramaiah | పోలీస్ అధికారి​పై చెయ్యి చేసుకోబోయిన సీఎం: వీడియో వైరల్​

CM Siddaramaiah | పోలీస్ అధికారి​పై చెయ్యి చేసుకోబోయిన సీఎం: వీడియో వైరల్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: CM Siddaramaiah | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Karnataka CM Siddaramaiah) మరో వివాదంలో చిక్కుకున్నారు. బెళగావి belgaovi జరిగిన సభలో ఓ పోలీస్​ అధికారిపై చెయ్యి చేసుకోబోయారు. ఈ ఘటనపై సోషల్​ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పహల్​గామ్​ ఉగ్రదాడిపై సిద్ధరామయ్య రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్‌తో యుద్ధం అవసరం లేదు.. మేం ఇందుకు అనుకూలం కాదు.. శాంతియుత పరిస్థితులు ముఖ్యం. ప్రజలకు భద్రత ఎంతో అవసరం. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ఇవి కాస్త పాకిస్తాన్​ మీడియాలో ప్రసారమయ్యాయి. దీంతో బీజేపీ ఈ విషయమై తీవ్రంగా మండిపడింది. ఈ నేపథ్యంలో బెగళావిలో జరిగిన సభలో బీజేపీ నాయకులు సభ స్థలంలోకి దూసుకువచ్చారు.

ఈ క్రమంలో ఆయన పోలీస్​ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఒకానొక సమయంలో ఆయనపై చెయ్యి చేసుకోబోయారు. దీంతో సదరు పోలీస్​ అధికారి వెనక్కి జరిగినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియా వైరల్​గా మారింది. కాగా.. సీఎం సిద్ధరామయ్యపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Must Read
Related News