అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం (Central Government) సహకరించాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. నగరంలోని హోటల్ ITC కోహినూర్లో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల ప్రాంతీయ సమావేశంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం (CM Revanth) కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ (Hyderabad)ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్‌ను ప్రజెంట్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన సహా అన్నింటినీ ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని చూస్తున్నట్లు వెల్లడించారు. భారత్ ఫ్యూచర్ అనే ఒక సిటీనే త్వరలో నిర్మించడానికి చర్యలు చేపట్టామన్నారు. తమ ప్రణాళికలు అమలు కావాలంటే కేంద్రం సపోర్ట్ అవసరం అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉండాలన్నదే తమ ఆలోచన అని సీఎం అన్నారు.
CM Revanth Reddy | మోదీ బడే భాయ్
ముఖ్యమంత్రులకు ఉన్న ఇబ్బందులేంటో ప్రధాని మోదీ (Prime Minister Modi)కి కూడా తెలుసని రేవంత్రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ దేశానికి బడే భాయ్ అని చెప్పారు. బడే భాయ్‌గా ప్రధాని అన్ని రాష్ట్రాల అభివృద్ధికి మద్దతివ్వాలని కోరారు. డిసెంబర్ 9న 2047 విజన్ డాక్యుమెంట్‌ను ప్రజెంట్ చేస్తామన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా తెలంగాణ పనిచేస్తోందని తెలిపారు. మూసీ పునరుజ్జీవం, RRR, మెట్రో రైలు విస్తరణకు కేంద్రం అనుమతులివ్వాలని కోరారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో 10వ శాతం తెలంగాణ (Telangana) వాటా ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు సీఎం వెల్లడించారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చే చర్యలు చేపడుతామన్నారు. మూడేళ్లలో నగరంలో ఎలక్ట్రిక్ బస్సులనే నడుపుతామన్నారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
