Bheemgal
Bheemgal | వంతెనకు మరమ్మతులు చేపట్టాలి

అక్షరటుడే, భీమ్‌గల్‌: Bheemgal | ఇటీవల భారీ వర్షాలకు ధ్వంసమైన భీమ్‌గల్‌ – బడా భీమ్‌గల్‌ మధ్య వంతెనకు మరమ్మతులు చేపట్టాలని కాంగ్రెస్‌ నాయకులు కోరారు.

ఈ మేరకు పార్టీ మండలాధ్యక్షుడు బొదిరే స్వామి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను (TPCC Chief mahesh kumar Goud) కలిసి వినతిపత్రం అందజేశారు. భారీ వర్షాలకు వంతెన ధ్వంసం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, మరమ్మతులకు నిధులు కేటాయించాలని కోరారు.

దీంతో స్పందించిన టీపీసీసీ చీఫ్‌ వెంటనే రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డితో (Ministser Komati reddy venkat reddy) ఫోన్‌లో మాట్లాడి వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, వాక మహేష్, భూషన్, తదితరులు పాల్గొన్నారు.