అక్షరటుడే, ఇందూరు : Malkai Samata Mahender | నగరంలోని 28వ డివిజన్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిని (BJP Corporator Candidate) మల్కాయి సమత మహేందర్ అన్నారు. ఈ మేరకు ఖిల్లా ప్రాంతంలోని పలు కాలనీల్లో ప్రచారం నిర్వహించారు.
Malkai Samata Mahender | సమస్యల పరిష్కారానికి కృషి..
28వ డివిజన్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా వేధిస్తోందని సమత మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా తాను గెలిస్తే ముందుగా కాలనీల్లో డ్రెయినేజీ పనులను పూర్తిచేస్తామని.. అలాగే ఇంటింటికీ తాగునీరు అందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. డివిజన్ అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
Malkai Samata Mahender | అధినాయకుల సహకారంతో..
ఎంపీ అర్వింద్ (MP Arvind), ఎమ్మెల్యే ధన్పాల్ (MLA Dhanpal) సహకారంతో డివిజన్‌కు అధిక నిధులు తీసుకొస్తామని అభ్యర్థిని సమత మహేందర్ అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని.. ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారం అయ్యేవరకు పోరాడుతామని ఆమె పేర్కొన్నారు. కారక్రమంలో బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
