అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | తెలంగాణలో కాంగ్రెస్‌కు బీజేపీ (BJP) ప్రత్యామ్నాయం కాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లోక్‌సభలో బీజేపీ 8 సీట్లు గెలుపొందడం ఆకస్మిక విజయం మాత్రమేనని, అట్టడుగు స్థాయి బలం కాదన్నారు.
ఆదిలాబాద్, మెదక్ (Medak) జిల్లాలకు చెందిన కీలక నాయకులతో ఆదివారం కేటీఆర్ సమావేశం అయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల (Municiapl Elections)పై వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా జలాల (Krishna water) సమస్యలతో సహా తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ రాజీ పడినప్పటికీ బీజేపీ మౌనంగా ఉందని విమర్శించారు. గతంలో లేదా భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీకి నిజమైన పునాది బలం లేదా అట్టడుగు స్థాయి ఉనికి లేదని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నుంచి పంచాయతీ ఎన్నికల వరకు ఓటర్లు బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారని చెప్పారు.
KTR | కేసీఆర్ కనిపిస్తే ధైర్యం
రాష్ట్రంలో కేసీఆర్ (KCR) కనిపిస్తే ధైర్యం వస్తుందని ప్రజలు అనుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. రాజేంద్రనగర్‌కు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ 24 నెలల పాలన విఫలం అయిందన్నారు. దీంతో కేసీఆర్ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ తీరుతో రాష్ట్రంలో ఎవరి దగ్గర డబ్బులు లేకుండా పరిస్థితులు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారాలు తగ్గిపోయాయని, ఉపాధి లేకుండా పోయిందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఆయన విమర్శలు చేశారు. బయట కాంగ్రెస్‌లో ఉన్నామని చెబుతున్న వారు, స్పీకర్ దగ్గర మాత్రం తాము బీఆర్ఎస్లో ఉన్నట్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.