అక్షరటుడే, కామారెడ్డి: Collector Kamareddy | గిరిజన ఆశ్రమ పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అధికారులను ఆదేశించారు. కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా, ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ సమీపంలో ఉన్న ఆశ్రమ పాఠశాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Collector Kamareddy | డ్రెయినేజీ సమస్య..
పాఠశాల వెలుపల డ్రెయినేజీ సమస్యతో పాఠశాల పరిసరాల్లో అసౌకర్యం ఏర్పడుతున్నట్లు గుర్తించిన కలెక్టర్ తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి అవసరమైన మరమ్మతులు చేపట్టి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని (Kamareddy Municipality) ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పరిశుభ్రత పాటించాలని, పిచ్చి మొక్కలు తొలగించాలని, సంబంధిత అధికారులకు సూచించారు. పాఠశాలలో విద్యా బోధన, వసతి సదుపాయాలు, భోజన ఏర్పాట్లు, స్టోర్ రూమ్ తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులను భోజన వసతులపై అడిగి తెలుసుకున్నారు.
Collector Kamareddy | విద్యార్థులతో వాలీబాల్ ఆడి..
పాఠశాల ఆవరణలో కలెక్టర్ విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడి వారిలో ఉత్సాహం నింపారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి గిరిజన సంక్షేమ శాఖ అధికారి సతీష్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్, తహశీల్దార్ జనార్ధన్, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
