అక్షరటుడే, ఇందూరు : DCEB Secretary | నిబంధనలకు విరుద్ధంగా ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి నియామకాన్ని చేపట్టారని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవాధ్యక్షుడు కృపాల్ సింగ్ (Kripal Singh) అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ (Collectorate)లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి (Prajavani)లో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యదర్శిగా నియమించిన సీతయ్య ఇప్పటికే రెండు పర్యాయాలు విధులు నిర్వహించారన్నారు. మళ్లీ ఆయనకే బాధ్యతలు ఇవ్వడం సరి కాదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నియామకాన్ని రద్దుచేసి నూతన కార్యదర్శిని ఎన్నుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు సాయ రెడ్డి పాల్గొన్నారు.
