అక్షరటుడే బోధన్/మెండోరా/ కోటగిరి : Arrive Alive | రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అరైవ్ అలైవ్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు
Arrive Alive | బోధన్ పట్టణంలో..
రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక కుటుంబాలు ఇబ్బందుల పాలయ్యాయని అలాంటి పరిస్థితులు రావొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (Bodhan ACP Srinivas) తెలిపారు. ఈ మేరకు బోధన్ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతిఒక్క వాహనదారులు ఇంటి నుంచి త్వరగా బయలుదేరాలని.. నిధానంగా గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) పాటించాలని సూచించారు. కార్యక్రమంలో బోధన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రమణ, ఎస్సై భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.
Arrive Alive | మెండోరాలో..
మెండోరా మండలంలోని పోచంపాడ్‌లో ఎస్సై సుహాసిని (SI Suhasini) ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మద్యం సేవించి వాహనాలు నడపడం కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారన్నారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్, సీట్‌బెల్ట్ వాడకపోవడం, అతివేగం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వీటిపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
Arrive Alive | కోటగిరిలో..
పోతంగల్ మండల కేంద్రంలో పోలీస్‌శాఖ (Police Department), సర్పంచ్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో వాహనదారులకు అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటగిరి ఎస్సై సునీల్ మాట్లాడుతూ.. ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని సూచించారు. రోడ్డు ప్రమాదాలను (Road Accidents) నివారించాలంటే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరారు. మైనర్ పిల్లలకు బైకులు ఇవ్వకూడదని ఒకవేళ మైనర్ పిల్లలు బైక్ నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆటోలలో పరిమితికి మించి వెళ్లకూడాదన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కల్లూరి హన్మాండ్లు (బజరంగ్) ఏఎస్సై బన్సీలాల్, సాయన్న, స్థానికులు, వాహనదారులు, తదితరులు పాల్గొన్నారు.
ముప్కాల్‌లో..
ఉప్లూర్‌లో..



