HomeతెలంగాణRSS Nizamabad | హిందువులకు బాధ్యత గుర్తు చేయడమే శతాబ్ది ఉత్సవాల లక్ష్యం

RSS Nizamabad | హిందువులకు బాధ్యత గుర్తు చేయడమే శతాబ్ది ఉత్సవాల లక్ష్యం

- Advertisement -

అక్షరటుడే ఇందూరు: RSS Nizamabad | ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల లక్ష్యం హిందూ సమాజానికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేయడమేనని ఆర్ఎస్ఎస్ తెలంగాణ (RSS Telanagana) సహా ప్రాంత ప్రచార ప్రభు కుమార్ తెలిపారు.

నగరంలో గురువారం మూడు నగరాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘటిత హిందూ సమాజాన్ని నిర్మితం చేయడం కోసమే వివిధ కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు.

విజయదశమి (Vijayadashami) సందర్భంగా దేశం మొత్తంలో స్వయం సేవకులందరూ ఆర్ఎస్ఎస్ గణవేష (RSS Ganavesha) ధరించి ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. ప్రతి వీధిలో పెద్దసంఖ్యలో హిందూ సమ్మేళనాలు, యువకుల కోసం ప్రత్యేకంగా యువ సమ్మేళనాలు, ప్రతి హిందువు ఇంటిని సంపర్కం చేయడం కోసం జన జాగరణ (jana jaganara) వంటి విశేష కార్యక్రమాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సంఘచాలకు డాక్టర్ కాపర్తి గురుచరణం, నగర కార్యవాహ అర్గుల సత్యం, సహకార్యవాహ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News