అక్షరటుడే, వెబ్‌డెస్క్: TG Municipal Elections | తెలంగాణలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధం అవుతోంది. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
TG Municipal Elections | షెడ్యూల్ అంశాలు
జనవరి 12: వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల.
జనవరి 13: పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా విడుదల, టీ-పోల్ (T-Poll) యాప్‌లో అప్‌లోడ్.
జనవరి 16: పోలింగ్ స్టేషన్ల వారీగా ఫొటోలతో సహా ఓటర్ల తుది జాబితా విడుదల.
అధికారులకు ఆదేశాలు
ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్యాలెట్ బాక్సుల అంచనా సిద్ధం చేయాలని ఎలక్షన్ కమిషనర్ ఆదేశించారు. ఈమేరకు రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, జోనల్, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ టీమ్‌ల నియామకాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బంది నియామకం కోసం టీ-పోల్ సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగుల వివరాలను అప్‌డేట్ చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు.