అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vaibhav Taneja | టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా(సీఎఫ్‌వో) ఉన్న భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా(47) (Vaibhav Taneja) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 2024లో అసాధారణంగా రూ.1,150 కోట్లు (139 మిలియన్ డాలర్లు) సంపాదించిన అతను మైక్రోసాఫ్ట్ సీఈవో(Microsoft CEO) సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ వార్షిక ఆదాయాలను కూడా అధిగమించి వార్తలలో నిలిచారు. దశాబ్దాలలో ఒక ఫైనాన్స్ చీఫ్‌కు లభించిన అత్యధిక ప్యాకేజీలలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ విషయాన్ని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ మొదట నివేదించింది. 2023లో టెస్లా సీఎఫ్‌వో(Tesla CFO)గా బాధ్యతలు చేపట్టిన తనేజా, బేసిక్ పే కింద కింద 4,00,000 డాలర్లు (సుమారు రూ.3.3 కోట్లు) అందుకున్నారు.
Vaibhav Taneja | భారీ సంపాదన..
2024లో సుందర్ పిచాయ్ సంపాదన 10.73 మిలియన్ డాలర్లు కాగా, సత్యనాదెళ్ల సంపాదన 79.106 డాలర్లుగా ఉంది. ఈ సందర్బంగా CA వైభవ్ తనేజాను The Institute of Chartered accountants of India, (ICAI) వారు అభినందించారు. చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ‘సీఏ వైభవ్ తనేజా’ (CA Vaibhav Taneja) అత్యున్నత స్థాయిలో నిలవడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టెస్లా షేర్లు సుమారు 250 డాలర్ల వద్ద ట్రేడవుతున్నప్పుడు ఈ ఈక్విటీ-లింక్డ్ ఇన్సెంటివ్‌లు మంజూరు కాగా, అవి నాలుగేళ్ల కాలంలో వైభవ్ తనేజాకు అందుతాయి. 2025, మే 19 నాటికి టెస్లా స్టాక్ సుమారు 342 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇటీవల నెలల్లో కంపెనీ డెలివరీలు తగ్గడం, లాభాలు తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ఆయన ఆదాయం భారీగా పెరిగింది.
భారతదేశంలో పుట్టిన వైభవ్ తనేజా, 1999లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పొందాడు. 2000లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో ఛార్టర్డ్ అకౌంటెంట్(Chartered Accountant)గా అర్హత సాధించారు. 2006లో యునైటెడ్ స్టేట్స్(United States)లో సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్‌గా మారారు. తనేజా దాదాపు 17 సంవత్సరాలు గ్లోబల్ ఆడిట్ సంస్థ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్‌లో పనిచేశాడు. భారతదేశంతో పాటు అమెరికాలోనూ సేవలందించి, అష్యూరెన్స్‌లో సీనియర్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. తనేజా 2017లో టెస్లాలో కార్పొరేట్ కంట్రోలర్‌గా చేరారు. ఆయన కృషిని గుర్తించి, 2019 మార్చిలో చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్‌గా నియమించారు. 2023 ఆగస్టులో ఆయన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌వో) CFO పదవికి ఎదిగే వరకు అదే హోదాలో పనిచేశారు. 2021 జనవరిలో టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇది కంపెనీ అంతర్జాతీయ వృద్ధి వ్యూహంలో ఆయన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.