PM Modi | కాశ్మీర్‌ను నాశ‌నం చేసేందుకే ఉగ్ర దాడులు.. ప‌హ‌ల్గామ్ బాధితుల‌కు న్యాయం చేస్తామ‌ని మోదీ హామీ
PM Modi | కాశ్మీర్‌ను నాశ‌నం చేసేందుకే ఉగ్ర దాడులు.. ప‌హ‌ల్గామ్ బాధితుల‌కు న్యాయం చేస్తామ‌ని మోదీ హామీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ :PM Modi | అభివృద్ధి బాట ప‌డుతున్న కాశ్మీర్‌ను నాశ‌నం చేసేందుకే ఉగ్ర‌వాదులు (Terrorists) దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అన్నారు. జ‌మ్మూకాశ్మీర్‌తో పాటు దేశ‌ అభివృద్ధిని శత్రువులు ఇష్ట‌ప‌డ‌డం లేద‌న్నారు. ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి బాధితుల‌కు న్యాయం చేస్తామ‌ని పున‌రుద్ఘాటించారు. మోదీ ఆదివారం తన మన్ కీ బాత్(Man Ki Baath) రేడియో కార్యక్రమం(Radio Program)లో మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రవాద దాడిని ప్రస్తావించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 22న దాడి చేసిన ఉగ్రవాదులు.. కశ్మీర్‌ను నాశనం చేయాలనుకుంటున్నారన్నారు.

PM Modi | నిరాశ వాదానికి ప్ర‌తిబింబం..

ఉగ్ర‌వాదుల వెనుక ఉన్న వారు పిరికివాళ్ల‌ని, ప‌హ‌ల్గామ్ దాడి వారి నిరాశ‌ను ప్ర‌తిబింబిస్తుంద‌ని మోదీ అన్నారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి(Terrorist attack) సీమారంత ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారి నిరాశకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ఇది వారి పిరికితనాన్ని చూపిస్తుంద‌ని తెలిపారు. కశ్మీర్‌లో శాంతి తిరిగి వస్తున్న సమయంలో, పాఠశాలలు, కళాశాలలు ఉత్సాహంగా న‌డుస్తాయ‌న్నారు. ప్రజాస్వామ్యం బలపడుతోంద‌ని, పర్యాటకం పెరుగుతోంద‌ని, యువతకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయని గుర్తు చేశారు. కానీ జమ్మూ కశ్మీర్‌(Jammu and Kashmir)తో పాటు దేశం అభివృద్ధి చెందడాన్ని శత్రువులు ఇష్టపడడం లేద‌న్నారు. ఉగ్రవాదులు కాశ్మీర్‌ను మరోసారి నాశనం చేయాలనుకుంటున్నార‌ని తెలిపారు.

PM Modi | భార‌తీయుల హృదయం ర‌గిలి పోతోంది..

పహల్గామ్(Pahalgam) ఉగ్రవాద దాడి బాధితులకు న్యాయం జరుగుతుందని నేను మరోసారి హామీ ఇస్తున్నాన‌ని మోదీ తెలిపారు. ఈ దాడి త‌న హృదయంలో తీవ్ర వేదనను మిగిల్చిందని ప్రధాని చెప్పారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడితో ప్రతి పౌరుడి హృదయ విదారకమైంది. బాధితుల కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడు ప్రగాఢ సానుభూతి చెందుతున్నాడ‌ని వివ‌రించారు. ఈ దాడి కారణంగా భారతదేశంలోని ప్రతి పౌరుడు కోపంతో రగిలిపోతున్నాడని తనకు అర్థమవుతుందన్నారు. ఉగ్రవాదం సవాళ్లను ఎదుర్కోవాలనే మన సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.