అక్షరటుడే, గాంధారి : Gandhari | సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch elections) పోటీ చేస్తున్న అభ్యర్థి ఇంటి ఎదుట టెంట్ కాలిపోయింది. ఈ ఘటన గాంధారిలో (Gandhari) చోటు చేసుకుంది. అయితే ప్రమాదవశాత్తు టెంట్ కాలిపోయిందా.. ఎవరైనా తగలబెట్టారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గాంధారి తాజా మాజీ సర్పంచ్ సంజీవ్ యాదవ్ ఈసారి కూడా తన భార్య రేణుకతో నామినేషన్ వేయించారు. ఎలక్షన్ నేపథ్యంలో తన ఇంటి వద్ద అనుచరులు, గ్రామస్థులు కూర్చోవడానికి వీలుగా టెంట్ ఏర్పాటు చేశారు. గురువారం తెల్లవారు సమయంలో చూసేసరికి ఒక టెంట్ పూర్తిగా దగ్ధం కాగా.. మూడు సైడ్ వాళ్లు సైతం కాలిపోయాయి. ప్రమాదవశాత్తు టెంట్ తగలబడిందా లేదా ఎవరైనా కావాలని తగలబెట్టారనేది చర్చనీయాంశంగా మారింది. ఇందులో మూడు బైక్ సీట్లు కూడా కాలిపోయాయి. ఎన్నికల సమయంలో ఈ విధంగా జరగడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
