అక్షరటుడే, వెబ్‌డెస్క్: Secunderabad | సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శాంతి ర్యాలీకి తరలి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders), కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.
సికింద్రాబాద్‌ను విభజించే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ఆధ్వర్యంలో శనివారం ఉదయం శాంతిర్యాలీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తామని తలసాని తెలిపారు. అయితే ఉదయం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ర్యాలీకి బయలుదేరగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతి ర్యాలీకి అనుమతి లేదంటు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు.
Secunderabad | భారీగా మోహరించిన పోలీసులు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ప్యాట్నీ సెంటర్ (Patni Center) వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకుని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. సికింద్రాబాద్ బచావో నినాదాలతో బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేస్తున్నారు. నల్ల జెండాలు, కండువాలు ధరించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు తరలి వెళ్తున్నారు.
Secunderabad | ఎమ్మెల్యేల వాగ్వాదం
తెలంగాణ భవన్ (Telangana Bhavan) ముందు పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు శాంతిర్యాలీకి వెళ్లడానికి తెలంగాణ భవన్ చేరుకున్నారు. వారు బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ర్యాలీకి అనుమతి లేదని చెబుతున్నారు. దీంతో పోలీసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాగ్వాదం చేశారు.