HomeజాతీయంSabarimala | శబరిమలలో ఉద్రిక్తత.. తెలుగు భక్తులపై దాడి

Sabarimala | శబరిమలలో ఉద్రిక్తత.. తెలుగు భక్తులపై దాడి

శబరిమలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sabarimala | శబరిమలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేశారు. దీంతో ఓ భక్తుడి తలపగిలింది.

అయ్యప్ప స్వామి (Ayyappa Swami) దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది అయ్యప్ప స్వాములు దర్శనం కోసం వెళ్తున్నారు. ఈ క్రమంలో తెలుగు భక్తులపై తాజాగా దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. వాటర్‌ బాటిల్‌ ధర ఎక్కువ ఉందని అడిగినందుకు షాపు యజమాని గాజు సీసాతో భక్తుడి తల పగులగొట్టాడు. దీంతో పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల భక్తులు షాపు వద్దకు చేరుకున్నారు. షాపు వద్ద నిల్చొని నిరసన తెలిపారు.. వ్యాపారులను, భక్తులను పోలీసులు అడ్డుకున్నారు.

భక్తుడి తలపై గాజు సీసాతో దాడి చేసి, హైదరాబాద్ (Hyderabad) నగరానికి చెందిన ఒక భక్తుడి మాలను వ్యాపారి తెంపేసినట్లు తెలుస్తోంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భక్తులు ఆందోళన చేపట్టగా.. స్థానికులు ఆ వ్యాపారికి అండగా రావడం గమనార్హం. దీంతో ఉద్రిక్తత నెలకొంది.  పోలీసులు కూడా వ్యాపారులకే మద్దతు తెలుపుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

Sabarimala | గతంలో సైతం..

శబరిమలలో రద్దీ అనుగుణంగా ఏర్పాట్లు చేయలేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి స్వామి వారి దర్శనానికి వచ్చిన వారికి అక్కడ కనీస సౌకర్యాలు లేవు. కనీసం భక్తులతో అధికారులు, స్థానికులు మర్యాదగా ప్రవర్తించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు భక్తులపై అక్కడ వివక్ష కొనసాగుతోంది. ఇటీవల ఓ పోలీసు అధికారి తెలుగు భక్తులు (Telugu Devotees) దారి అడిగితే అసభ్యంగా మాట్లాడిన విషయం తెలిసిందే. శబరిమలలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Must Read
Related News