అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Global Summit | తెలంగాణ రైజింగ్ (Telangana Rising) గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం అయింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సును ప్రారంభించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
తెలంగాణ అబివృద్ధి దేశానికే ఆదర్శమని గవర్నర్ అన్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ఎన్నో విజయాలు సాధించిందని చెప్పారు. 2047కు తెలంగాణ త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకనామీని చేరుకోవాలని ఆశిస్తున్నాని చెప్పారు. ఈ సమ్మిట్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy), వివిధ దేశాల నుంచి అతిథులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
Global Summit | సీఎం అద్భుతాలు చేశారు
యువ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అద్భుతాలు చేశారని నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి అన్నారు. 20 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశారని చెప్పారు. మహిళలు, బాలికలకు ఉచిత ప్రయాణం కల్పించారని పేర్కొన్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు.
Global Summit | పలు అంశాలపై చర్చలు
రెండు రోజుల పాటు జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో అనేక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రధాన శిఖరాగ్ర వేదికతో పాటు, ఈ ప్యానెల్ చర్చలను నిర్వహించడానికి నాలుగు సమాంతర సమావేశ మందిరాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు విభిన్న రంగాలను కవర్ చేస్తూ మొత్తం 12 సెషన్‌లు జరగనున్నాయి. సంబంధిత మంత్రుల మార్గదర్శకత్వంలో విషయ నిపుణులు, ఆలోచనా నాయకులు, డొమైన్ నిపుణులు ఈ చర్చలలో పాల్గొంటారు.
Global Summit | చర్చల వివరాలు
సెషన్ 1 : మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు హాల్1లో చర్చలు జరగనున్నాయి. 2047లోకి జస్ట్ ట్రాన్సిషన్ – తెలంగాణ భవిష్యత్తును శక్తివంతం చేయడం,తెలంగాణ ఇంధన భవిష్యత్తు, గ్రీన్ ఎనర్జీ అంశాలపై చర్చించనున్నారు.
రెండో హాల్లో గ్రీన్ మొబిలిటీ 2047 – జీరో-ఎమిషన్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (Electric Vehicles), ఉద్గార రహిత సాంకేతికతలు మరియు భవిష్యత్ చలనశీలతపై చర్చలు ఉంటాయి.
మూడో హాల్లో సెమీకండక్టర్లలో అవకాశాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు మరియు ఆవిష్కరణలు. నాలుగో హాల్లో తెలంగాణను అంతర్జాతీయ విద్య కేంద్రంగా ఉంచడానికి వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌పై చర్చిస్తారు.
సెషన్ 2: సాయంత్రం 4:15 నుంచి సాయంత్రం 5:15 వరకు సాగుతుంది. ఇందులో ఏరోస్పేస్, రక్షణ రంగాలలో తెలంగాణ వృద్ధి, టాలెంట్ మొబిలిటీ, సంపన్న తెలంగాణ కోసం ఆరోగ్యకరమైన తెలంగాణ, కంట్రీ సెషన్స్ – కొరియా & ఆస్ట్రేలియా అంశాలపై చర్చిస్తారు.
సెషన్ 3 సాయంత్రం 5:30 నుండి సాయంత్రం 6:30 వరకు నిర్వహిస్తారు. ఆసియాన్ టైగర్స్‌తో తెలంగాణ భాగస్వామ్యం, గిగ్ ఎకానమీ – ఫ్లూయిడ్ కెరీర్‌ల పెరుగుదల, అరుదైన వ్యూహం – విలువ గొలుసుల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం, కెనడా సెషన్ & మహిళా వ్యవస్థాపకత చర్చలు జరగనున్నాయి.