అక్షరటుడే, ఇందూరు: Nikhat Zareen | మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ (Women’s World Boxing Championship) ఫైనల్లో ఇందూరు క్రీడాకారిణి నిఖత్ జరీన్ బంగారు పతకం కైవసం చేసుకుంది. 51 కిలోల విభాగంలో గురువారం సాయంత్రం చైనీస్ తైపి క్రీడాకారిణి గువోజీ జువాన్పై (Chinese Taipei athlete Guoji Juan) 5-0 తేడాతో గెలుపొందింది.
Nikhat Zareen | మ్యాచ్ మొదటి నుంచి దూకుడు ప్రదర్శించి..
మ్యాచ్ మొదటి నుంచి తన పంచులతో దూకుడు ప్రదర్శించిన నిఖత్ (Nikhat Zareen) చివరి వరకు పట్టు నిలుపుకుంది. గత 20 నెలలుగా ప్రపంచ వేదికల్లో ఎక్కడా పతకం సాధించని నిఖత్ మళ్లీ ఫాంలోకి వచ్చింది. బంగారు పతకం సాధించడం పట్ల జిల్లా క్రీడాకారులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
