Homeతాజావార్తలుJubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. నిరుద్యోగుల నుండి కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి...

Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. నిరుద్యోగుల నుండి కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ

Jubilee Hills by-elections | ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్రంలోని నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాల భరోసా ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఇప్పటికీ ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోవడాన్ని నిరుద్యోగులు గట్టిగా తప్పుపడుతున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills By Election | అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలోని నిరుద్యోగ యువత గట్టి హెచ్చరిక ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శిస్తూ, రానున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By Election)ను తమ నిరసన వేదికగా మలచాలని నిర్ణయించుకున్నారు.

ఈ ఎన్నికలో నిరుద్యోగుల తరపున 1000 మంది అభ్యర్థులుగా నామినేషన్ వేసేందుకు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ సిద్ధమవుతోంది. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల(Osmania University Arts College) వద్ద నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ కందరపల్లి కాశీనాథ్ మాట్లాడుతూ,రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి వరకూ ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు.

Jubilee Hills By Election | గ‌ట్టిగానే నిర‌స‌న‌..

ఇది నిరుద్యోగుల పట్ల ఘోర అవమానం. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడమే మా లక్ష్యం,” అని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ భూక్యా కుమార్, జనరల్ సెక్రటరీ ఆర్.కె. వన్నార్ చోళ తదితరులు పాల్గొన్నారు. ఇక సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో గ్రూప్-1 పరీక్షలలో జరిగిన అక్రమాలపై అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి(BRS Leader Rakesh Reddy) మాట్లాడుతూ,“గ్రూప్-1 నియామక ప్రక్రియను ప్రభుత్వం మరింత జఠిలం చేస్తోంది. పారదర్శకత కరువై, వేలాది నిరుద్యోగులు నష్టపోతున్నారు,” అని విమర్శించారు.

మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్(Guvvala Balaraj) మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగాల చోరీ జరుగుతోంది. ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయాన్ని జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటుతో బదులివ్వాలి అని అన్నారు.ఈ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు పాల్గొన్నారు. వారు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ,నిరుద్యోగుల గొంతును అణిచివేయాలంటే పోరాటం మరింత ఉద్ధృతంగా సాగుతుందిఅని హెచ్చరించారు. అయితే తాము రాజకీయ లక్ష్యాల కోసం కాకుండా, యువత భవిష్యత్తు కోసం పోరాడుతున్నామని జేఏసీ స్పష్టం చేసింది. తమ నామినేషన్లు ఒక నిరసన రూపంగా ఉంటాయని పేర్కొంది. కాగా, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) పై నిరుద్యోగ యువత ఆగ్రహం రోజు రోజుకీ పెరుగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే, రానున్న ఎన్నికల్లో ప్రజల తీర్పు గట్టిగానే ఉండబోతుందని ఈ ఉద్యమం సూచిస్తోంది.