162
అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి కలెక్టరేట్లో (Kamareddy Collectorate) నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా మహిళలు ప్రత్యేకంగా బతుకమ్మ, బోనాలు తీసుకుని వచ్చారు.
విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆర్అండ్బీ ఈఈ
తెలంగాణ విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆవిష్కరిస్తారని అందరూ భావించారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో కలెక్టర్ బదులుగా ఆర్అండ్బీ ఈఈ మోహన్ (R&B EE Mohan) విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.