అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Congress | సోనియా చొరవతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని.. తెలంగాణ ప్రజలు ఆమెకు రుణపడి ఉంటారని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి (DCC President Nagesh Reddy) పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో సోనియాగాంధీ జన్మదినం నిర్వహించారు. ఈ సందర్భంగా కేట్ కట్‌చేశారు. అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ (Sonia Gandhi) చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం నగేష్ రెడ్డి మాట్లాడుతూ.. దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న గొప్పవ్యక్తి సోనియాగాంధీ అని పేర్కొన్నారు.
Nizamabad Congress | అధికారం కోసం చూడలేదు..
దేశం కోసం భర్త మృతి చెందినప్పటికీ దుఃఖాన్ని దిగమింగుకుని పార్టీ కోసం నిలబడిన వ్యక్తి సోనియాగాంధీ అని నగేష్ రెడ్డి పేర్కొన్నారు. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అధికారంలోకి వచ్చినప్పటికీ ఏనాడు అధికారం కోసం చూడలేదన్నారు. ఎల్లప్పుడూ పార్టీ కోసం కృషి చేస్తున్న సోనియాగాంధీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాబోయే ప్రోగ్రామింగ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రధానిగా రాహుల్ గాంధీని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా ఛైర్మన్ కేశ వేణు, పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, భక్తవత్సలం, జావీద్ అక్రమ్, రత్నాకర్, రామర్తి గోపి, విపుల్ గౌడ్, వేణు రాజ్, రాజా నరేందర్ గౌడ్, సేవాదళ్ సంతోష్, యాదగిరి, ఈసా, మఠం రేవతి, అబ్దుల్ ఎజాజ్, పోల ఉష, చంద్రకళ, లవంగ ప్రమోద్, సకినాల శివ కుమార్, అంతరెడ్డి విజయ్ పాల్ రెడ్డి, విజయ లక్ష్మి, సుజాత, ఆషాబీ, మాలిక బేగం, రాజేంద్ర ప్రసాద్, నరేందర్ గౌడ్, విజయ రాణి, స్వప్న, మీనా, షకీల్, ముస్తఫా, ఆదె ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.