అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Police | సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన ఈ ముఠా.. తాజాగా పోలీసుల వెబ్సైట్లను హ్యాక్ చేసింది. దీంతో పది రోజులుగా అధికారులు ఆయా వెబ్సైట్ సేవలను నిలిపివేశారు.
హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ (Rachakonda Commissionerate) వెబ్ సైట్లు హ్యాక్ అయ్యాయి. ఏకంగా పోలీస్ కమిషనరేట్ల వెబ్ సైట్లను బెట్టింగ్ మాఫియా హ్యాక్ చేసింది. దీంతో పది రోజులుగా వెబ్ సైట్ల సేవలు నిలిచిపోయాయి. కమిషనరేట్ వెబ్ సైట్లు ఓపెన్ చేస్తే బెట్టింగ్ యాప్ వెబ్ సైట్లకు రీ-డైరెక్ట్ అయ్యేలా హ్యాకర్లు చేశారు. దీంతో ఐటీ విభాగం రెండు సైట్ల సర్వర్లను డౌన్ చేసింది. ప్రస్తుతం ఈ వెబ్సైట్ల నిర్వహణను నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (National Informatics Center) చూస్తోంది. ఆ సంస్థ అప్రమత్తం అయి సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టింది. హ్యాకింగ్‌కు పాల్పడిన ముఠాను పట్టుకోవడానికి సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber Crime Police) దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Police | ఇటీవల హైకోర్టు వెబ్సైట్..
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ను (Telangana High Court website) దుండగులు ఇటీవల హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుంటే ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్ (online betting site) ఓపెన్ అయింది. పీడీఎఫ్ ఫైల్స్‌కు బదులు బీడీజీ స్లాట్ అనే బెట్టింగ్ సైట్ ఓపెన్ అయినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో ఈ ఘటనపై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులను ఫిర్యాదు చేశారు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులు సమస్యను పరిష్కరించారు.
Hyderabad Police | హ్యాకింగ్‌తో కలవరం
హ్యాకర్లు ఇటీవల ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాక్ చేస్తున్నారు. ప్రజల డేటాను దొంగిలిస్తున్నారు. దీంతో సైబర్ సెక్యూరిటీ (Cyber Security)పై ఆందోళన నెలకొంది. కీలకమైన ప్రజా భద్రతకు సంబంధించిన సైట్లను సైతం గతంలో కొందరు హ్యాక్ చేసి డేటా తస్కరించారు. ఇటీవల హైకోర్టు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి బెట్టింగ్ సైట్‌కు రీ డైరెక్ట్ అయ్యేలా చేశారు. తాజాగా పోలీసులకే షాక్ ఇస్తూ వెబ్సైట్లను హ్యాక్ చేశారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
