Goa | గోవాలో డ్రగ్స్​ ముఠాలను పట్టుకున్న తెలంగాణ పోలీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Goa | తెలంగాణ (Telangana)లో ఇటీవల డ్రగ్స్​ దందా విపరీతంగా సాగుతోంది. విచ్చలవిడిగా డ్రగ్స్​ విక్రయాలు సాగుతున్నాయి. దీంతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి గంజాయి, డ్రగ్స్​ అమ్ముతున్న వారి ఆట కట్టిస్తున్నారు. అయితే వీరికి ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్​ అందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో గోవాలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు (Narcotics Bureau officials) కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించారు. గోవాలో 4 డ్రగ్స్ ముఠాలను తెలంగాణ అధికారులు పట్టుకున్నారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Goa | తెలంగాణ (Telangana)లో ఇటీవల డ్రగ్స్​ దందా విపరీతంగా సాగుతోంది. విచ్చలవిడిగా డ్రగ్స్​ విక్రయాలు సాగుతున్నాయి. దీంతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి గంజాయి, డ్రగ్స్​ అమ్ముతున్న వారి ఆట కట్టిస్తున్నారు. అయితే వీరికి ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్​ అందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో గోవాలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు (Narcotics Bureau officials) కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించారు.

గోవాలో 4 డ్రగ్స్ ముఠాలను తెలంగాణ అధికారులు పట్టుకున్నారు. పబ్​లలో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు డీజేలు వనిష్ టక్కర్, స్వదీప్​ను అరెస్ట్ చేశారు. వీరితో పాటు పలువురు నిందితులను అరెస్ట్​ చేశారు. 70 మంది డ్రగ్స్‌ పెడ్లర్స్‌ స్థావరాలపై దాడులు చేశారు. వీరు గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్​ (Hyderabad)లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం రూ.1.25 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలో డ్రగ్స్‌ ముఠాకు డబ్బులు అందుతున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే గోవాలో అల్ప్రాజోలం తయారు చేసి తెలంగాణకు సప్లయ్​ చేస్తున్న మరో ముఠాను సైతం అదుపులోకి తీసుకున్నారు. అక్కడి సూర్యప్రభ ఫార్మా కంపెనీలో భారీగా అల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...