అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, లోకసభ ప్రతిపక్ష నాయకుడు (LOP) రాహుల్ గాంధీని తెలంగాణ కాంగ్రెస్ (Congress) నేతలు శనివారం కలిశారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills)లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నవీన్ యాదవ్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాహుల్‌గాంధీని కలిశారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అనంతరం రాహుల్‌గాంధీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఉన్నారు.
Rahul Gandhi | అభినందించిన ఖర్గే
జూబ్లీహిల్స్‌లో గెలిచిన నవీన్యాదవ్ను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అభినందించారు. ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అంశంపై చర్చించారు.
