అక్షరటుడే, వెబ్‌డెస్క్: MLC Kavitha | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Telangana Jagruthi President Kavitha) ట్వీట్ చేశారు. రోహిత్ వేముల చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ఎంత సమయం పడుతుందని ప్రశ్నించారు.
కోదాడలో జరిగిన దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం దళితులపై దాడులు పెరిగాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిందని.. రోహిత్ వేముల చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ఇంకా ఎంత టైం పడుతుందని ప్రశ్నించారు. దళితులపై ప్రేమను చర్యల ద్వారా చూపించాలని.. మాటల ద్వారా కాదన్నారు. పోలీసు కస్టడీలో కొడుకును కోల్పోయిన తల్లి రోదనను వినాలన్నారు. వెంటనే రోహిత్ వేముల చట్టాన్ని ప్రవేశపెట్టాలని.. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.