- Advertisement -
HomeతెలంగాణBathukamma | తెలంగాణ అతి పెద్ద పండుగ బతుకమ్మ.. తొమ్మిది రోజుల ప్రత్యేకతలు, నైవేద్యాల విశేషాలు

Bathukamma | తెలంగాణ అతి పెద్ద పండుగ బతుకమ్మ.. తొమ్మిది రోజుల ప్రత్యేకతలు, నైవేద్యాల విశేషాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bathukamma | తెలంగాణ సాంస్కృతిక గుండెచప్పుడు అయిన బతుకమ్మ పండుగ (Bathukamma Festival) నేటి నుండి ఘనంగా ప్రారంభం అవుతుంది.

ప్రకృతిని, అమ్మతనాన్ని, ఆడపడుచుల అనురాగాన్ని ప్రతిబింబించే ఈ పండుగను మహిళలు ఎంతో ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగ ప్రతిరోజూ ఒక ప్రత్యేక నామంతో, ప్రత్యేక నైవేద్యంతో, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

- Advertisement -

Bathukamma | తొమ్మిది రోజులు – తొమ్మిది బతుకమ్మలు – తొమ్మిది రకాల నైవేద్యాలు

1. ఎంగిలి పూల బతుకమ్మ (పెత్రమాస)

బతుకమ్మ పండుగకు (Bathukamma Festival) శ్రీకారం చుట్టే రోజు. నువ్వులు, బియ్యం పిండి, నూకల మిశ్రమాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

2. అటుకుల బతుకమ్మ

శుద్ధ పాడ్యమినాడు జరిగే ఈ రోజున సప్పిడి పప్పు, బెల్లం, అటుకుల మిశ్రమం నైవేద్యంగా వాడతారు.

3. ముద్దపప్పు బతుకమ్మ

ఉడికించిన పప్పు, పాలు, బెల్లంతో తయారుచేసిన ముద్దపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు.

4. నానబియ్యం బతుకమ్మ

ఈ రోజున నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపిన నైవేద్యం అమ్మవారికి అర్పిస్తారు.

5. అట్ల బతుకమ్మ

ఈ రోజున ప్రత్యేకంగా తయారుచేసిన అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది పూర్ణాన్నసమర్పణ భావనకు ప్రతీకగా ఉంటుంది.

6. అలిగిన బతుకమ్మ

ఈ రోజున నైవేద్యం పెట్టకపోవడమే ప్రత్యేకత. అందుకే దీనికి ‘అలిగిన బతుకమ్మ’ అని పేరు.

7. వేపకాయల బతుకమ్మ

బియ్యం పిండి వేపకాయల ఆకారంలో చేసి, అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

8. వెన్నముద్దల బతుకమ్మ

నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లంతో వెన్నముద్దలు తయారుచేసి సమర్పిస్తారు.

9. సద్దుల బతుకమ్మ

పండుగకు కిరీటం వంటిదైన ఈ రోజున ఐదు రకాల అన్నాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం సంప్రదాయం. వాటిలో పెరుగన్నం, నిమ్మకాయ అన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం,నువ్వులన్నం ఉంటాయి.

Bathukamma | ఆడపడుచుల ఉత్సాహం మిన్న

ప్రతి రోజూ పూలతో తయారు చేసిన బతుకమ్మను మధ్యలో ఉంచి, ఆడపడుచులు చుట్టూ ప్రదక్షిణలతో పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతారు. చివర రోజు బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేయడం ఈ పండుగ (Festival) ముగింపుగా జరుగుతుంది.

Bathukamma | తెలంగాణ గర్వంగా జరుపుకునే సంబురం

తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రబుత్వం ప్రతి ఏడాది బతుకమ్మ పండుగను అధికారికంగా జరుపుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణవాసుల్లో తెలుగుతనాన్ని, మాతృభూమి పట్ల ప్రేమను పెంపొందించేలా చేస్తోంది.అమ్మో అంత ఖర్చా?.. ఇండోర్‌లో రూ. 300 కోట్లతో మండపం ఏర్పాటు

- Advertisement -
- Advertisement -
Must Read
Related News