అక్షరటుడే, వెబ్‌డెస్క్ : WEF 2026 | దావోస్ (Davos)లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో తెలంగాణ ప్రతినిధులు వివిధ సంస్థలతో సమావేశం అవుతున్నారు. ఆయా రంగాల్లో పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్‌కు పలు కంపెనీలు మద్దతు తెలిపాయి.
సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం దావోస్‌లో ప్రఖ్యాత బహుళజాతి విద్య, ప్రచురణ సంస్థ పియర్సన్‌తో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది. UKకి చెందిన ఈ కంపెనీ రాష్ట్రంలో AI నైపుణ్యం, క్రెడెన్షియలింగ్‌లో తన ఉనికిని విస్తరించడానికి ఆసక్తి చూపింది. తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్ (TAIH) కింద ఏర్పాటు చేయనున్న గ్లోబల్ AI అకాడమీ కోసం AI చొరవలలో పియర్సన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చింది.
WEF 2026 | ఆరోగ్య సంరక్షణపై..
జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం కొలరేటివ్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్‌కేర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (AI CoLab) ఆరోగ్య సంరక్షణ డొమైన్‌కు అనుసంధానించబడిన AIలో అనువర్తిత పరిశోధన, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలపై తెలంగాణతో సహకరిస్తుంది. ఈ మేరకు ఎంవోయూపై సంతకం చేసింది. ఆరోగ్య సంరక్షణ, ప్రజారోగ్యం, లైఫ్ సైన్సెస్‌లలో సహకార అనువర్తిత పరిశోధనలను కూడా సులభతరం చేయడం కోసం ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది. దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రెండు దేశాల మార్కెట్, పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి అవకాశాలపై దృష్టి పెట్టడం దీని ఉద్దేశం.