Ministers counter | కేసీఆర్​ వ్యాఖ్యలపై మంత్రుల కీలక వ్యాఖ్యలు​

అక్షరటుడే, హైదరాబాద్: Ministers’ counter : బీఆర్​ఎస్​ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు స్పందించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి minister ponguleti srinivas reddy మాట్లాడుతూ.. “కేసీఆర్‌ మంచి సూచనలు చేస్తారేమో అనుకున్నాం.. కానీ, ఆయన మనసంతా విషం నింపుకొన్నారు.. కాంగ్రెస్‌ను విలన్‌గా చిత్రీకరించే పనిలో ఉన్నారు.. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ విలనా?..” కేసీఆర్‌ వల్ల ధనిక తెలంగాణ కాస్త అప్పుల రాష్ట్రంగా మారిందని విమర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు jupally krishna rao […]

అక్షరటుడే, హైదరాబాద్: Ministers’ counter : బీఆర్​ఎస్​ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు స్పందించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి minister ponguleti srinivas reddy మాట్లాడుతూ.. “కేసీఆర్‌ మంచి సూచనలు చేస్తారేమో అనుకున్నాం.. కానీ, ఆయన మనసంతా విషం నింపుకొన్నారు.. కాంగ్రెస్‌ను విలన్‌గా చిత్రీకరించే పనిలో ఉన్నారు.. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ విలనా?..” కేసీఆర్‌ వల్ల ధనిక తెలంగాణ కాస్త అప్పుల రాష్ట్రంగా మారిందని విమర్శించారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు jupally krishna rao మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ బద్నామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ కు అప్పజెప్పితే.. అప్పుల రాష్ట్రంగా మార్చారు.. రూ. 8 లక్షల కోట్ల అప్పు చేసింది నిజమా, కాదా..? నెలకు రూ.6 వేల కోట్లు వడ్డీ కింద కట్టాల్సి వస్తోందని అని అన్నారు.

ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ mlc addanki dayakar మాట్లాడుతూ.. కేసీఆర్‌ హింసరాజ్‌లాగా మారిపోయారని విమర్శించారు. చెప్పిందే చెప్పి.. పాత చింతకాయ పచ్చడిలా కేసీఆర్‌ ప్రసంగం ఉందని అన్నారు. కొత్త సీసాలో పాత సారాయిలాగా కేసీఆర్‌ స్పీచ్ ఉందంటూ దెప్పిపొడిచారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...