More
    HomeతెలంగాణTeenmar Mallanna | తీన్మార్​ మల్లన్న కొత్త పార్టీ.. పేరు, గుర్తు ఇదే..

    Teenmar Mallanna | తీన్మార్​ మల్లన్న కొత్త పార్టీ.. పేరు, గుర్తు ఇదే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Teenmar Mallanna | తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ రాబోతోంది. ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న (MLC Teenmar Mallanna) అలియాస్​ చింతపండు నవీన్​ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.

    ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ని (Telangana Rajyaadhikara Party) ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆత్మగౌరవం.. అధికారం.. వాటా.. నినాదంతో పార్టీని స్థాపించనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని (Hyderabad) బంజారాహిల్స్‌లో గల తాజ్ కృష్ణ హోటల్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ పేరు, జెండాలను పరిచయం చేశారు.

    Teenmar Mallanna | బీసీల ఆత్మగౌరవం కోసం..

    బీసీల ఆత్మగౌరవం కోసం పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు మల్లన్న తెలిపారు. ఈ పార్టీ ద్వారా బహుజనులకు రాజ్యాధికారం అందించడమే మా లక్ష్యమని చెప్పారు. ఈ పార్టీ అన్ని వర్గాల మద్దతుతో ముందుకు సాగుతుందని, ముఖ్యంగా బీసీ సంఘాలను (BC communities) ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు. కాగా.. కాంగ్రెస్​లో ఉన్న సమయంలో తీన్మార్​ మల్లన్న ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనను పార్టీ ఆయనను స్పస్పెండ్​ చేసింది.

    Teenmar Mallanna | జెండా ఇదే..

    పార్టీ జెండా రెండు రంగులతో పైభాగంలో ఎరుపు, కింది భాగంలో ఆకుపచ్చ రూపొందించారు. అలాగే జెండా మధ్యలో పిడికిలి బిగించిన చెయ్యి ఆత్మగౌరవానికి చిహ్నం. కార్మిక చక్రంతో పాటు వరి కంకులు ప్రజాస్వామ్యం, సామాజిక అభ్యున్నతికి సూచిక. ఇరువైపులా ఆలీవ్ ఆకులు చేర్చడం ద్వారా శాంతి, ఐక్యతను తెలియజేస్తున్నాయి. జెండా పైభాగంలో ‘ఆత్మగౌరవం.. అధికారం.. వాటా’ అనే నినాదాలు ఉన్నాయి.

    More like this

    Dichpally mandal | గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్​ అందజేత

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally mandal | డిచ్​పల్లి మండలం ఘన్​పూర్​కు (Ghanpur) చెందిన యువకులు గ్రామ పంచాయతీకి బాడీ...

    Armoor RTC | విద్యార్థుల ‘యాత్ర దానం’కు చేయూతనందించాలి

    అక్షరటుడే, ఆర్మూర్: Armoor RTC | విద్యార్థుల ‘యాత్ర దానం’ విహారయాత్రలకు (Excursion) కార్పొరేట్​ సంస్థలు, ఎన్నారైలు, స్వచ్ఛంద...

    Cyber Fraud | డిజిటల్​ అరెస్ట్​ పేరిట బెదిరింపులు.. హార్ట్​ ఎటాక్​తో రిటైర్డ్​ డాక్టర్​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyber Fraud | సైబర్​ నేరగాళ్ల బెదిరింపులకు ఓ మహిళ బలైపోయింది. డబ్బుల కోసం...