MLC Teenmar Mallanna | తెలంగాణ వ్యతిరేకి కాసు బ్రహ్మానందరెడ్డి.. ఆయన విగ్రహాన్ని తొలగించాలన్న తీన్మార్ మల్లన్న

అక్షరటుడే, వెబ్​డెస్క్​: MLC Teenmar Mallanna | తెలంగాణ భావాజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆనవాళ్లు తెలంగాణలో లేకుండా చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (MLC Teenmar Mallanna) డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ (KBR Park) వద్ద బీసీ నాయకులతో కలిసి ఆయన శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్ పేరును తక్షణమే మార్చాలని, ప్రస్తుతమున్న కాసు బ్రహ్మానందరెడ్డి పేరును తొలగించి, తెలంగాణ సిద్ధాంతకర్త […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: MLC Teenmar Mallanna | తెలంగాణ భావాజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆనవాళ్లు తెలంగాణలో లేకుండా చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (MLC Teenmar Mallanna) డిమాండ్ చేశారు.

హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ (KBR Park) వద్ద బీసీ నాయకులతో కలిసి ఆయన శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్ పేరును తక్షణమే మార్చాలని, ప్రస్తుతమున్న కాసు బ్రహ్మానందరెడ్డి పేరును తొలగించి, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ (Professor Jayashankar) పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే, పార్కు ఎదురుగా ఉన్న కాసు విగ్రహాన్ని తొలగించి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరారు.

MLC Teenmar Mallanna | తెలంగాణ వ్యతిరేకుల ఆనవాళ్లు తొలగించాల్సిందే..

తెలంగాణ ప్రజల గోస పోసుకుని, తెలంగాణ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన ఆనవాళ్లు ఇంకా కొనసాగించడం సరికాదని మల్లన్న అన్నారు. “కేబీఆర్ పార్క్ (KBR Park) పేరును వెంటనే తొలగించి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలి. ఒకవేళ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టకపోతే, బీసీ సర్కారు ఏర్పాటు కాగానే ఆ పని పూర్తి చేస్తాం” అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, కేబీఆర్ పార్క్ ముందు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

భవిష్యత్తులో బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి (Kasu Brahmananda Reddy) విగ్రహాన్ని జేసీబీల సాయంతో పెకలించివేసి, ఆ స్థానంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని తీన్మార్ మల్లన్న తెలిపారు. కేవలం కేబీఆర్ పార్క్ మాత్రమే కాకుండా, హైదరాబాద్ నగరంలోని (Hyderabad City) అన్ని పార్కులకు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారి పేర్లను పెట్టాలని డిమాండ్ చేశారు. నగరంలోని ఆసుపత్రులు, హోటళ్లు, వివిధ ప్రాంతాల పేర్లను కూడా తెలంగాణ మహనీయుల పేర్లతో మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...