అక్షరటుడే, వెబ్‌డెస్క్: Raghavendra Dwivedi| ఆసియా కప్-2025 (Asia Cup) ను భారత్ Team India గెలుచుకున్న ఆ క్షణం మిలియన్ల అభిమానులకు మరువలేని ఆనందాన్ని ఇచ్చింది.
స్టేడియం నిండా సంబరాలు, ఆటగాళ్ల కళ్లలో ఆనంద భాష్పాలు, మైదానంలో ఉత్సాహంతో భావోద్వేగాలు. కానీ ఈ విజయం వెనుక కనిపించని ఓ వ్యక్తి ఉన్నాడు. అతడే రాఘవేంద్ర ద్వివేది.
ప్రతి మ్యాచ్ ముందు ఆటగాళ్లకు బంతులు వేస్తూ.. ప్యాడ్స్ వెనుక కనిపించే ఓ పల్చని శరీరం, నుదుట బొట్టు పెట్టుకున్న మృదు స్వభావి కొందరికి మాత్రమే తెలుసు.
అయితే అతని ప్రాధాన్యం చాలా మందికి తెలియకపోవచ్చు. టీమిండియాకు త్రోడౌన్ స్పెషలిస్టుగా, బ్యాట్స్‌మెన్ శిక్షణ గురువుగా, 13 ఏళ్లుగా టీమిండియాకు వెన్నెముకగా నిలుస్తూ ఎన్నో విజయాలు దక్కేలా చేశాడు. అతడిని ఆటగాళ్లు అందరూ ముద్దుగా రఘు అని పిలుచుకుంటారు.
కర్ణాటక Karnataka లోని కుమటా ప్రాంతానికి చెందిన రాఘవేంద్ర.. బాల్యంలోనే క్రికెట్‌పై విపరీతమైన మక్కువ పెంచుకున్నాడు. కానీ, చిన్నతనంలో చేయి విరగడం వల్ల క్రికెటర్ కావాలన్న అతడి కల నెరవేరలేదు.
Raghavendra Dwivedi | బస్టాండు, ఆలయం, చివరికి శ్మశానం..
తండ్రి తిరస్కరించడంతో రూ.21 తో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. వారం రోజుల పాటు హుబ్లీ బస్టాండులో పడుకున్న అతడిని పోలీసులు తరమడంతో ఓ పది రోజుల పాటు సమీపంలోని ఆలయంలో Temple ఉన్నాడు.
ఆలయం నుంచి కూడా వెళ్లిపొమ్మని చెప్పడంతో చేసేదేమి లేక శ్మశానవాటికలో ఆశ్రయం పొందాడు. అక్కడే తినేవాడు, అక్కడే పడుకునేవాడు. నాలుగున్నరేళ్ల పాటు రఘు శ్మశాన వాటికలోనే గడిపాడు.
అయితే పని లేక, ఆశ్రయం లేక ఎన్నో రాత్రులు పస్తులున్న రాఘవేంద్ర చివరకు కర్ణాటక ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ ద్వారా బెంగళూరులో ఓ అవకాశం దక్కించుకున్నాడు. అక్కడే తిలక్ నాయుడు Tilak Naidu ద్వారా జవగల్ శ్రీనాథ్ Javagal Srinath పరిచయం అయ్యాడు.
శ్రీనాథ్ దయతో కర్ణాటక జట్టులో త్రోడౌన్ స్పెషలిస్ట్‌గా Raghavendra Dwivedi కి అవకాశం దక్కింది. అప్పటి నుంచి జీవితం మారింది.
2011లో సచిన్ టెండూల్కర్ Sachin Tendulkar స్వయంగా రాఘవేంద్ర ప్రతిభను గుర్తించి, అతడిని టీమ్ ఇండియా సపోర్టింగ్ స్టాఫ్‌లో చేర్చాలని సూచించారు.
అప్పటి నుంచి వరల్డ్ కప్ World Cup 2011, ఛాంపియన్స్ ట్రోఫీ Champions Trophy 2013, వరుస టోర్నీలు, ఇప్పుడు 2025 టీ20 వరల్డ్ కప్ T20 World Cup, 2025 ఆసియా కప్ వరకూ అతడి కృషి మరవలేనిది.
ఇప్పటి వరకు రఘు విసిరిన బంతుల సంఖ్య 1 మిలియన్ దాటి ఉంటుందని అంచనా. అతడి త్రోడౌన్ బంతులు 150 కి.మీ వేగంతో, బౌన్సీ యాక్షన్‌తో వస్తాయి.
అందుకే విరాట్ కోహ్లీ Virat Kohli, రోహిత్ శర్మ Rohit Sharma వంటి బ్యాట్స్‌మెన్.. మైదానంలో జరిగే మ్యాచ్‌లో బాల్స్ ఎంతటి వేగంతో వచ్చినా సులువుగా ఆడేస్తారు. నెట్స్‌లో రఘుని ఎదుర్కొనడం వల్ల మ్యాచ్‌లలో మాకు సులవయ్యేదని పలు సందర్భాలలో అన్నారు.
2017 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా విరాట్ కోహ్లీ..రఘు గురించి మాట్లాడుతూ.. “నా విజయంలో ఈ వ్యక్తి పాత్ర ఎంతో ఉంది. ప్రపంచం గుర్తించకపోయినా అతని కృషిని మేం మరవలేం..” అని అన్నారు.
Raghavendra Dwivedi | పాదాభివందనం చేయబోయిన తిలక్ వర్మ..
రఘు ప్రతిభను గుర్తించిన బీసీసీఐ.. అతగాడికి చక్కని గౌరవం ఇచ్చింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు (Player of the Match award)ను తిలక్ వర్మ (Tilak Verma) కు రాఘవేంద్ర చేతుల మీదుగా అందజేసింది. ఈ క్రమంలో మన తెలుగోడు తిలక్ వర్మ Tilak Varma త్రోడౌన్ స్పెషలిస్ట్ కు పాదాభివందనం చేయబోవడం అందరినీ ఆకర్షించింది.