Homeజిల్లాలుఖమ్మంKhammam | బాలుడిపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు.. కేసు నమోదు చేయడంతో ఆత్మహత్య

Khammam | బాలుడిపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు.. కేసు నమోదు చేయడంతో ఆత్మహత్య

ఖమ్మం జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం బయటకు తెలియడంతో పరువు పోతుందని ఆత్మహత్య చేసుకున్నాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khammam | విద్యార్థులకు (students) క్రమ శిక్షణ నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు క్రమశిక్షణ తప్పాడు. పాఠాలు చెప్పాల్సిన టీచర్​ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో (Khammam district) చోటు చేసుకుంది.

కొనిజర్ల మండలం తనికెళ్ల గ్రామ సమీపంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో (minority gurukul school) ప్రభాకర్​రావు అనే వ్యక్తి బయాలజీ టీచర్​గా పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న ఓ బాలుడిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ విషయం బాలుడి తల్లిదండ్రులకు తెలియడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో (police station) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Khammam | ఇలా బయట పడింది

స్థానిక ఎస్సై సూరజ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో చదివే ఓ విద్యార్థి దసరా సెలవులకు (Dussehra holidays) ఇంటికి వెళ్లాడు. ఇంటి వద్ద బాలుడి ప్రవర్తనలో మార్పు రావడం, ప్రతి విషయానికి భయ పడుతుండటంతో తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో ఉపాధ్యాయుడి వేధింపుల విషయం వారికి చెప్పారు. దీంతో రెండు రోజుల క్రితం వారు కొణిజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Khammam | పరువు పోతుందని..

లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం బయటకు తెలియడంతో పాటు కేసు నమోదు కావడంతో పరువు పోతుందని ఉపాధ్యాయుడు ప్రభాకర్​రావు భయపడ్డాడు. దీంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.