అక్షరటుడే ఇందల్వాయి: DPO Nizamabad | గ్రామాల్లో వందశాతం పన్ను వసూలు చేయాలని డీపీవో శ్రీనివాస్ సూచించారు. ఇందల్వాయి మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని (Mandal Praja Parishad) బుధవారం తనిఖీ చేశారు. జీపీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అనంతరావు, ఎంపీవో రాజ్‌కాంత్, జీపీ కార్యదర్శులు పాల్గొన్నారు.
