Homeఅంతర్జాతీయంChina | చైనాలో కండోమ్స్​పై ట్యాక్స్​.. ఎందుకో తెలుసా?

China | చైనాలో కండోమ్స్​పై ట్యాక్స్​.. ఎందుకో తెలుసా?

చైనాలో జననాల రేటు తగ్గడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కండోమ్స్​, గర్భ నిరోధక మాత్రలపై వ్యాట్​ విధించడానికి సిద్ధమైంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : China | చైనాలో కొంతకాలంగా జననాల రేటు భారీగా తగ్గింది. ఫలితంగా అక్కడ యువతరం తగ్గి పోయి వృద్ధుల జనాభా పెరుగుతోంది. ఇటీవల ప్రజలు పిల్లలను కనడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో చైనా ప్రభుత్వం (Chinese government) కీలక నిర్ణయం తీసుకుంది.

దేశంలో తగ్గుతున్న జనన రేటును నియంత్రించడానికి చైనా ప్రభుత్వం గర్భనిరోధకాలపై విలువ ఆధారిత పన్ను (VAT) విధించాలని నిర్ణయించింది. గత మూడేళ్ల నుంచి దేశంలో జననాల రేటు పడిపోతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం కండోమ్స్​, ఇతర గర్భ నిరోధకాలపై వ్యాట్​ విధించడానికి సిద్ధమైంది. చైనా గతంలో కుటుంబ నియంత్రణ కోసం కఠిన నిబంధనలు అమలు చేసింది. ఒకరే బిడ్డను కనాలనే నిబంధన (one-child policy) పెట్టింది. 1993 నుంచి అక్కడ కండోమ్స్​పై ఎలాంటి వ్యాట్​ లేదు. తాజాగా 13శాతం వ్యాట్​ విధిస్తూ నిర్ణయం చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

China | వారికి ప్రోత్సహకాలు

పిల్లల సంరక్షణ సేవలు, వృద్ధుల సంరక్షణ సంస్థలు, వైకల్యం సేవా ప్రదాతలు, వివాహ సంబంధిత సేవలను మినహాయించడం ద్వారా కాబోయే తల్లిదండ్రులకు కొత్త ప్రోత్సాహకాలను రూపొందిస్తుంది. ఈ మార్పులు జనవరిలో అమలులోకి వస్తాయి. వృద్ధుల జనాభా పెరుగుతుండటంతో ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనమని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఆ దేశంలో 2024లో కేవలం 9.54 మిలియన్ల జననాలు మాత్రమే నమోదు అయ్యాయి. దీంతో పిల్లలను కనే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. పితృత్వం, ప్రసూతి సెలవులను (maternity leave) పొడిగించనుంది.

China | పిల్లలపై అనాసక్తి

చైనాలో యువతరం పిల్లలపై ఆసక్తి చూపడం లేదు. అక్కడ పిల్లలను 18 ఏళ్ల వారకు పెంచాలంటే 76 వేల డాలర్లు ఖర్చు అవుతుందని అంచానా.. దీంతో చాలా మంది పెళ్లి, పిల్లలు గురించి ఆలోచించడం లేదు. పెళ్లి చేసుకున్నా పిల్లలను కనడం లేదు. దీంతో ప్రభుత్వం పిల్లలను కనాలని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో కండోమ్స్​, గర్భ నిరోధక మాత్రలపైమ (contraceptive pills) పన్ను పెంచితే ప్రజలు వాటి వినియోగం తగ్గిస్తారని భావిస్తోంది. దీంతో జననాల రేటు పెరిగే అవకాశం ఉంది.

Must Read
Related News