Homeబిజినెస్​Tata | రతన్‌ టాటా లేక ‘గ్రూప్‌’ విలవిల.. రూ. 7 లక్షల కోట్ల సంపద...

Tata | రతన్‌ టాటా లేక ‘గ్రూప్‌’ విలవిల.. రూ. 7 లక్షల కోట్ల సంపద ఆవిరి!

Tata | రతన్‌ టాటా మరణానంతరం టాటా గ్రూప్‌ కోలుకోలేకపోతోంది. ఆ గ్రూప్‌లోకి షేర్ల మార్కెట్‌ క్యాప్‌(Market cap) విలువ ఏడాదిలో రూ. 7.32 లక్షల కోట్లు ఆవిరవడం గమనార్హం.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tata | రతన్‌ టాటా(Ratan Tata) మరణానంతరం టాటా గ్రూప్‌ కోలుకోలేకపోతోంది. ఆ గ్రూప్‌లోకి షేర్ల మార్కెట్‌ క్యాప్‌(Market cap) విలువ ఏడాదిలో రూ. 7.32 లక్షల కోట్లు ఆవిరయ్యాయి.

రతన్‌ టాటా గతేడాది అక్టోబరు 9 న 86 ఏళ్ల వయసులో పరమపదించారు. ఆయన జీవించి ఉన్నప్పుడు ఇన్వెస్టర్ల(Investors)కు కాసుల పంట పండించిన కంపెనీలు.. ఆయన మరణానంతరం నష్టాలనే మిగిల్చాయి. పలు కంపెనీలు భారీగా విలువను కోల్పోవడం గమనార్హం.

గ్రూప్‌లోని 23 లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(Market capitalization) ఏడాది క్రితం రూ.33.57 లక్షల కోట్లుగా ఉండగా.. గత సెషన్‌ నాటికి రూ.26.39 లక్షల కోట్లకు తగ్గింది. అయితే రతన్‌ టాటా లేకపోవడానికి గ్రూప్‌ స్టాక్స్‌ పతనానికి సంబంధం లేదని నిపుణులు అంటున్నారు.

ప్రపంచ స్థూల ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ వాణిజ్య పరిణామాలు, డిమాండ్‌ తగ్గుముఖం పట్టడం, ఐటీ(IT), ఆటో స్టాక్‌లు పతనమవడంతో టాటా గ్రూప్‌(Tata group) మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో 21 శాతం కోల్పోయిందని పేర్కొంటున్నారు.

Tata | కంపెనీల వారీగా..

ఏడాది కాలంలో తేజస్‌ నెట్‌వర్క్స్‌(Tejas Networks) షేరు విలువ 50 శాతం కంటే ఎక్కువ క్షీణించింది. ఇదే కాలంలో ట్రెంట్‌ 44 శాతం, టాటా టెక్నాలజీస్‌(Tata Technologies Limited) 33 శాతం క్షీణించాయి.

టీసీఎస్‌(TCS) 29 శాతం, టాటా ఎలెక్సీ, టాటా మోటార్స్‌ ఒక్కొక్కటి 28 శాతం పడిపోయాయి. ఓరియంటల్‌ హోటల్స్‌, టీఆర్‌ఎఫ్‌(TRF) 24 శాతం చొప్పున, వోల్టాస్‌ 23 శాతం, టాటా కెమికల్స్‌ 18 శాతం, టాటా పవర్‌ 16 శాతం నష్టపోయాయి. టాటా కమ్యూనికేషన్స్‌, నెల్కో ఒక్కొక్కటి 13 శాతం తగ్గాయి.

ఐటీ రంగంలో మందగమనం, యూఎస్‌ వాణిజ్య పరిణామాల నేపథ్యంలో టీసీఎస్‌ భారీగా పతనమైంది. లిస్టింగ్‌తో అదరగొట్టిన టాటా టెక్నాలజీస్‌.. ఆ తర్వాత క్రమంగా విలువను కోల్పోయింది. అయితే ప్రస్తుతం ఆదాయాన్ని పెంచుకుంటుండడంతో ఈ స్టాక్‌పై ఆశావహ దృక్పథం ఏర్పడుతోంది.

టాటా మోటార్స్‌(Tata Motors) జేఎల్‌ఆర్‌ వ్యాపారంలో సవాళ్లను ఎదుర్కొంటోంది. యూకే ప్లాంట్‌లో ఇటీవల జరిగిన సైబర్‌ దాడితో స్టాక్‌ విలువ మరింత పతనమైంది.

Tata | పెరిగిన స్టాక్స్‌ ఇవే..

చాలా కంపెనీలు ఏడాది కాలంలో నష్టాల బాటలో పయనించగా.. కొన్ని మాత్రం లాభాలను అందించాయి. టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్ప్‌(Tata Investment Corporation Limited) అత్యధికంగా 40 శాతం పెరుగుదల నమోదు చేసింది.

బెనారస్‌ హోటల్స్‌ 14 శాతం పెరగ్గా.. టాటా స్టీల్‌ 8 శాతం, ఇండియన్‌ హోటల్స్‌ 5 శాతం, టైటాన్‌ 2 శాతం లాభాలను ఇచ్చాయి. టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ నామమాత్రంగా 0.2 శాతం లాభాలను అందించింది.

రతన్‌ టాటా మరణించిన తర్వాత ఏడాది కాలంలో టాటా గ్రూప్‌ స్టాక్స్‌లో 20 శాతానికిపైగా పతనమైన కంపెనీలు, కోల్పోయిన మార్కెట్‌ క్యాప్‌ వివరాలు..

కంపెనీ ఒక సంవత్సరం రిటర్న్స్‌ తగ్గిన మార్కెట్‌ క్యాప్‌(రూ. కోట్లలో)

  • తేజస్‌ నెట్‌వర్క్‌ -50.1 -10,235.6
  • ట్రెంట్‌ -43.8 -1,28,055.5
  • టాటా టెక్నాలజీస్‌ -32.4 -13,769.4
  • టీసీఎస్‌ -28.8 -4,43,378.5
  • టాటా ఎలెక్సీ -28.3 -13,392.1
  • టాటా మోటార్స్‌ -27.5 -94,813
  • టీటీఎంఎల్‌ -27.4 -4,238
  • ఓరియంటల్‌ హోటల్స్‌ -26.7 -844.8
  • టీఆర్‌ఎఫ్‌ -25.4 -134.4
  • వోల్టాస్‌ -23.3 -13,759
  • ఏఎస్‌ఏ -20 -232.3