అక్షరటుడే, ఎల్లారెడ్డి: Tata Health Insurance | కామారెడ్డి పట్టణంలో టాటా హెల్త్ ఇన్సూరెన్స్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ (Tata Health Insurance recruitment drive) విజయవంతమైందని కంపెనీ స్టేడ్ హెడ్ ప్రవీణ్ గోస పేర్కొన్నారు.
టాటా హెల్త్ ఇన్సూరెన్స్, విశ్వమాత్రే సొల్యూషన్స్ ఆధ్వర్యంలో పట్టణంలో హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ (health insurance advisors) కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. 2026 మార్చి నాటికి కామారెడ్డి పట్టణంలో నూతన బ్రాంచ్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఈ బ్రాంచ్ ఏర్పాటుతో పట్టణ ప్రజలకు మెరుగైన టాటా హెల్త్ ఇన్సూరెస్స్ సేవలు అందడంతో పాటు నిరుద్యోగ యువతకు ఆరోగ్య బీమా రంగంలో (health insurance sector) స్థిరమైన, వృత్తిపరమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు.
రాబోయే రోజుల్లో బ్రాంచ్ అవసరాల కోసం స్థానిక హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్, సేల్స్ మేనేజర్స్ నియామకం భారీగా చేపట్టబడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్, శ్రీకాంత్, ట్రైనర్ స్వాతి పాల్గొన్నారు. స్థానిక రిక్రూట్‌మెంట్ గురించి బ్రాంచ్ వివరాల గురించి ఆసక్తి గల అభ్యర్థులు 86867 62636, 99663 36101లలో సంప్రదించాలని సూచించారు.
