Tata | రతన్‌ టాటా లేక ‘గ్రూప్‌’ విలవిల.. రూ. 7 లక్షల కోట్ల సంపద ఆవిరి!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tata | రతన్‌ టాటా(Ratan Tata) మరణానంతరం టాటా గ్రూప్‌ కోలుకోలేకపోతోంది. ఆ గ్రూప్‌లోకి షేర్ల మార్కెట్‌ క్యాప్‌(Market cap) విలువ ఏడాదిలో రూ. 7.32 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. రతన్‌ టాటా గతేడాది అక్టోబరు 9 న 86 ఏళ్ల వయసులో పరమపదించారు. ఆయన జీవించి ఉన్నప్పుడు ఇన్వెస్టర్ల(Investors)కు కాసుల పంట పండించిన కంపెనీలు.. ఆయన మరణానంతరం నష్టాలనే మిగిల్చాయి. పలు కంపెనీలు భారీగా విలువను కోల్పోవడం గమనార్హం. గ్రూప్‌లోని 23 లిస్టెడ్‌ […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tata | రతన్‌ టాటా(Ratan Tata) మరణానంతరం టాటా గ్రూప్‌ కోలుకోలేకపోతోంది. ఆ గ్రూప్‌లోకి షేర్ల మార్కెట్‌ క్యాప్‌(Market cap) విలువ ఏడాదిలో రూ. 7.32 లక్షల కోట్లు ఆవిరయ్యాయి.

రతన్‌ టాటా గతేడాది అక్టోబరు 9 న 86 ఏళ్ల వయసులో పరమపదించారు. ఆయన జీవించి ఉన్నప్పుడు ఇన్వెస్టర్ల(Investors)కు కాసుల పంట పండించిన కంపెనీలు.. ఆయన మరణానంతరం నష్టాలనే మిగిల్చాయి. పలు కంపెనీలు భారీగా విలువను కోల్పోవడం గమనార్హం.

గ్రూప్‌లోని 23 లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(Market capitalization) ఏడాది క్రితం రూ.33.57 లక్షల కోట్లుగా ఉండగా.. గత సెషన్‌ నాటికి రూ.26.39 లక్షల కోట్లకు తగ్గింది. అయితే రతన్‌ టాటా లేకపోవడానికి గ్రూప్‌ స్టాక్స్‌ పతనానికి సంబంధం లేదని నిపుణులు అంటున్నారు.

ప్రపంచ స్థూల ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ వాణిజ్య పరిణామాలు, డిమాండ్‌ తగ్గుముఖం పట్టడం, ఐటీ(IT), ఆటో స్టాక్‌లు పతనమవడంతో టాటా గ్రూప్‌(Tata group) మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో 21 శాతం కోల్పోయిందని పేర్కొంటున్నారు.

Tata | కంపెనీల వారీగా..

ఏడాది కాలంలో తేజస్‌ నెట్‌వర్క్స్‌(Tejas Networks) షేరు విలువ 50 శాతం కంటే ఎక్కువ క్షీణించింది. ఇదే కాలంలో ట్రెంట్‌ 44 శాతం, టాటా టెక్నాలజీస్‌(Tata Technologies Limited) 33 శాతం క్షీణించాయి.

టీసీఎస్‌(TCS) 29 శాతం, టాటా ఎలెక్సీ, టాటా మోటార్స్‌ ఒక్కొక్కటి 28 శాతం పడిపోయాయి. ఓరియంటల్‌ హోటల్స్‌, టీఆర్‌ఎఫ్‌(TRF) 24 శాతం చొప్పున, వోల్టాస్‌ 23 శాతం, టాటా కెమికల్స్‌ 18 శాతం, టాటా పవర్‌ 16 శాతం నష్టపోయాయి. టాటా కమ్యూనికేషన్స్‌, నెల్కో ఒక్కొక్కటి 13 శాతం తగ్గాయి.

ఐటీ రంగంలో మందగమనం, యూఎస్‌ వాణిజ్య పరిణామాల నేపథ్యంలో టీసీఎస్‌ భారీగా పతనమైంది. లిస్టింగ్‌తో అదరగొట్టిన టాటా టెక్నాలజీస్‌.. ఆ తర్వాత క్రమంగా విలువను కోల్పోయింది. అయితే ప్రస్తుతం ఆదాయాన్ని పెంచుకుంటుండడంతో ఈ స్టాక్‌పై ఆశావహ దృక్పథం ఏర్పడుతోంది.

టాటా మోటార్స్‌(Tata Motors) జేఎల్‌ఆర్‌ వ్యాపారంలో సవాళ్లను ఎదుర్కొంటోంది. యూకే ప్లాంట్‌లో ఇటీవల జరిగిన సైబర్‌ దాడితో స్టాక్‌ విలువ మరింత పతనమైంది.

Tata | పెరిగిన స్టాక్స్‌ ఇవే..

చాలా కంపెనీలు ఏడాది కాలంలో నష్టాల బాటలో పయనించగా.. కొన్ని మాత్రం లాభాలను అందించాయి. టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్ప్‌(Tata Investment Corporation Limited) అత్యధికంగా 40 శాతం పెరుగుదల నమోదు చేసింది.

బెనారస్‌ హోటల్స్‌ 14 శాతం పెరగ్గా.. టాటా స్టీల్‌ 8 శాతం, ఇండియన్‌ హోటల్స్‌ 5 శాతం, టైటాన్‌ 2 శాతం లాభాలను ఇచ్చాయి. టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ నామమాత్రంగా 0.2 శాతం లాభాలను అందించింది.

రతన్‌ టాటా మరణించిన తర్వాత ఏడాది కాలంలో టాటా గ్రూప్‌ స్టాక్స్‌లో 20 శాతానికిపైగా పతనమైన కంపెనీలు, కోల్పోయిన మార్కెట్‌ క్యాప్‌ వివరాలు..

కంపెనీ ఒక సంవత్సరం రిటర్న్స్‌ తగ్గిన మార్కెట్‌ క్యాప్‌(రూ. కోట్లలో)

  • తేజస్‌ నెట్‌వర్క్‌ -50.1 -10,235.6
  • ట్రెంట్‌ -43.8 -1,28,055.5
  • టాటా టెక్నాలజీస్‌ -32.4 -13,769.4
  • టీసీఎస్‌ -28.8 -4,43,378.5
  • టాటా ఎలెక్సీ -28.3 -13,392.1
  • టాటా మోటార్స్‌ -27.5 -94,813
  • టీటీఎంఎల్‌ -27.4 -4,238
  • ఓరియంటల్‌ హోటల్స్‌ -26.7 -844.8
  • టీఆర్‌ఎఫ్‌ -25.4 -134.4
  • వోల్టాస్‌ -23.3 -13,759
  • ఏఎస్‌ఏ -20 -232.3

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...